Begin typing your search above and press return to search.

కాజల్ జాగ్రత్త పడుతోందా ఏంటి?

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:48 AM GMT
కాజల్ జాగ్రత్త పడుతోందా ఏంటి?
X
హీరోయిన్ గా క్రేజ్ ప్లస్ గుర్తింపు సంపాదించుకున్న తొలి రోజుల్లోనే రిబ్బన్ కటింగులు.. లాంఛింగ్ ఈవెంట్ల ఆఫర్లు వచ్చేయడం సహజం. కొత్తగా ఎవరైనా క్లిక్ అయితే.. వారితో మాల్స్ కానీ.. షాప్స్ కానీ ఓపెనింగ్స్ చేయించడం చూస్తూనే ఉంటాం. కానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాత్రం ఇలాంటి వాటికి చాలాచాలా దూరంగా ఉంటూ వచ్చింది.

తనను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని లాంగ్ టెర్మ్ కాంట్రాక్టులు చేసుకున్నవారికి ప్రచారం చేసేది. అంతే తప్ప.. సింగిల్ డే ఈవెంట్.. ఓసారి రిబ్బన్ కటింగ్ చేయడాలు.. ఒక్క ప్రెస్ మీట్ తో ముగిసే కార్యక్రమాలను కాజల్ ఎంకరేజ్ చేసేది కాదు. మొన్నమొన్నటి వరకూ చందమామ ఇదే స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేసింది. కానీ ఇప్పుడు ఈమె యాంగిల్ మార్చేసింది. తాజాగా ఓ ఫేమస్ టాల్కం పౌడర్ కంపెనీ ఏర్పాటు చేసిన లాంఛింగ్ ఈవెంట్ కు అటెండ్ అయింది కాజల్. అక్కడ తగినంత గ్లామర్ కూడా ఒలకబోసింది. అమ్మడి డ్రెసింగ్ కూడా ఆకట్టుకునేలా అద్భుతంగా ఉంది.

కొన్ని రోజుల క్రితం ఓ కాఫీ షాప్ ఓపెనింగ్ లో కూడా కాజల్ అగర్వాల్ కనిపించింది. పెద్ద బ్రాండ్స్ అయినా.. ఇలా సడెన్ గా చిన్న ఈవెంట్స్ లో కనిపించడానికి కారణం ఏంటో అంతు చిక్కడం లేదు. అయితే.. కాజల్ కెరీర్ ఇప్పుడు తెగ వెలిగిపోతున్నా.. ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు దాటిపోయిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా ఎంత కష్టపడినా కొన్నేళ్లు మాత్రమే ఈ క్రేజ్ ఉంటుంది. అందుకే ముద్దొచ్చినపుడే చంకెక్కాలి.. క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలి అనే సూత్రాన్ని అప్లై చేస్తోందట కాజల్ అగర్వాల్.