పింక్ సారిలో అమ్మడు కుమ్ముడే

Sun Aug 13 2017 13:55:32 GMT+0530 (IST)

జయపజయలతో సంబందం లేకుండా దాదాపు సౌత్ హీరోలందరితో మెరిసిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.  ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోలందరితో స్క్రిన్ చేసుకుంది. తనకు పోటీగా ఎంత మంది హీరోలు వచ్చినా తన స్టైల్ లో తను సినిమాలను ఒకే సీబీస్తోంది ఈ సుందరి.అయితే రీసెంట్ ఈ అమ్మడు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ కుమ్మేస్తున్నాయి.  పింక్ సారిలో కాజల్ ని చుసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. లక్ష్మీ కల్యాణం సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు కూడా కాజల్ అలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వయసు.పెరుగుతున్న కొద్దీ అందంతో అభిమానులను పెంచుకుంటూ పోతోంది అంటున్నారు మరి కొందరు. అయితే రీసెంట్ గా ఓ టివి కార్యక్రమానికి వెళ్ళినపుడు కాజల్ ఈ పింక్ సారిలో ఫొటోలకు ఫోజిచ్చింది. తమిళంలో సన్ టీవిలో వివేగం సినిమా ప్రమోషన్స్ కు ఇలా వెళ్ళింది కాజల్.

ప్రస్తుతం ఆమె నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. అలాగే ఈ అమ్మడు మరి కొన్ని సినిమాలతో ప్రస్తుతం బిజీగా వుంది. అజిత్ - వివేగం మరియ విజయ్ - మెర్సల్ చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉంటే.. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాలో హీరయిన్ గా నటిస్తోంది చందమామ.