ఫోటో స్టొరీ: వేడి పెంచుతున్న చందమామ!

Fri May 24 2019 16:16:24 GMT+0530 (IST)

ఈ జెనరేషన్లో హీరోయిన్ ల కెరీర్ ఎంతకాలం సాగుతుంది అని ఎవరైనా అడిగితే మహా అంటే ఐదేళ్ళు అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు మాత్రం గత పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతూ ఇంకా క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ న్యూ జెనరేషన్ హీరోయిన్లకు కెరీర్ గోల్స్ సెట్ చేస్తున్నారు. కెరీర్ క్లోజ్ అయిందని విమర్శలు రావడం ఆలస్యం.. ఏదో ఒక హిట్ సాధించి మళ్ళీ తన సత్తా చాటుతుంది కాజల్.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను థ్రిల్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కాస్త హాట్ నెస్ డోస్ ను పెంచి ఒక ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటోలను తన  ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. పర్పుల్ కలర్ ఫ్రిల్స్ ఉన్న స్లీవ్ లెస్ గౌన్లో హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చిందరవందరగా ఉన్న హెయిర్ స్టైల్ తన హాట్ నెస్ ను మరింతగా పెంచింది. ఈ ఫోటోషూట్ కు సంబంధించిన  ఫోటోలు కొన్ని బ్లాక్ & వైట్ ఉండడంతో అవి మరింత ఇంటెన్స్ గా ఉన్నాయి.  తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా కాజల్ క్లీవేజ్ షో కూడా చేసేసింది.  ఉన్నట్టుండి ఈ విధంగా సోషల్ మీడియాలో హీట్ పెంచాలని ఎందుకు డిసైడ్ అయిందో ఏమో కానీ ఆమె అనుకున్నట్టుగా వేడి పెంచగలిగింది. ఈ ఫోటోలకు ఇన్స్టాలో లక్షలకొద్దీ లైకులు వచ్చాయి.

కాజల్ సినిమాల విషయానికి వస్తే.. తేజ - బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం 'సీత' లో కాజల్ హీరోయిన్.  ఈ చిత్రం ఈరోజే రిలీజ్ అయింది.  ఈ సినిమాతో పాటుగా శర్వానంద్ - సుధీర్ వర్మ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది.  తమిళంలో  'ప్యారిస్ ప్యారిస్'..'కోమలి' సినిమాల్లో నటిస్తోంది.  కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్.