Begin typing your search above and press return to search.

మెగా హీరో పక్కన మళ్ళీ కాజలేనా??

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:34 AM GMT
మెగా హీరో పక్కన మళ్ళీ కాజలేనా??
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ మొదలైపోయింది. దిల్ రాజు నిర్మాణంలో.. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'డీజే.. దువ్వాడ జగన్నాథం' టైటిల్ పై సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆగస్ట్ 29న ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా.. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

కొన్ని నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తుండడంతో.. ఇప్పటికే డీజే కి సంబంధించి చాలా పనుల్లో క్లారిటీ ఉంది. ముఖ్యంగా దిల్ రాజు నిర్మాణం అంటే పక్కా ప్లానింగ్ తో పనులు నడిచిపోతాయనే సంగతి తెలిసిందే. అయితే.. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బన్నీతో జోడీ కట్టే భామ ఎవరనే సంగతి తేలాల్సి ఉంది. అయితే.. ఆ రోల్ ని టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి ఆఫర్ చేసే ఛాన్సులు ఉన్నాయనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోసారి మెగా ఫ్యామిలీ హీరోతో ఆమె రొమాన్స్ చేయనుంది అంటున్నారు.

రీసెంట్ గా మెగాస్టార్ 150వ సినిమా షూటింగ్ కి వెళ్లిన దిల్ రాజు-హరీష్ శంకర్ లు.. కాజల్ తో చాలాసేపే మాట్లాడారట. హీరోయిన్ ఆఫర్ విషయం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీతో ఆర్య2- ఎవడు చిత్రాల్లో రెండుసార్లు జత కట్టిన కాజల్.. ముచ్చటగా మూడోసారి కూడా కలిసి నటించేందుకు సై అన్నట్లు తెలుస్తోంది. అయితే.. డైరెక్టర్ దగ్గర మరో ఆప్షన్ ఉందని.. ఆ సంగతి కూడా తేల్చుకున్నాక అప్పుడు హీరోయిన్ ని అనౌన్స్ చేయాలని అనుకుంటున్నాడట.