అబ్బే.. కాజల్ గురించి రూమర్లే

Mon Apr 16 2018 12:24:49 GMT+0530 (IST)

తెలుగు జాతి గర్వపడేలా చేసిన మాహా నటుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ కోసం ప్రస్తుతం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో గాని రూమర్స్ మాత్రం రోజుకోటి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఆ విషయాలపై చిత్ర యూనిట్ కూడా పెద్దగా స్పందించడం లేదు.ముఖ్యంగా పాత్రలకు సంబందించిన విషయాలలో స్టార్ నటీనటులను ఎంచుకున్నారని అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తోందని వార్తలు వచ్చాయి. అధికారికంగా చిత్ర యూనిట్ చెప్పకుండానే కొన్ని మీడియాల్లో ఆమె పాత్ర ఫిక్స్ అయిపోయిదని జయలలితగా కనిపించబోతున్నట్లు చెప్పేశారు. అయితే ఆ న్యూస్ కాస్త చందమామ దగ్గరకు వెళ్లడంతో ఆన్సర్ ఇచ్చేసింది.

ఇప్పటివరకు అలాంటి ఆఫర్స్ నా దగ్గరకు రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని ఆమె తెలుపడంతో ఫ్యాన్స్ లో ఒక క్లారిటీ వచ్చింది. మరి ఇలాంటి రూమర్స్ తొందరగా వైరల్ కాకుండా ఉండాలంటే చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడు.