Begin typing your search above and press return to search.

సీత పాపకు మరో లక్కీ ఆఫర్!

By:  Tupaki Desk   |   22 Aug 2019 1:30 AM GMT
సీత పాపకు మరో లక్కీ ఆఫర్!
X
కాజల్ అగర్వాల్ కు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మంచి మహర్దశ నడుస్తున్నట్టు ఉంది. నిజానికి ఇటీవలి కాలంలో క్రేజీ ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి కానీ దానికి తగ్గ సక్సెస్ మాత్రం ఈ సీత హీరోయిన్ కు దక్కడం లేదు. ఇటీవలే వచ్చిన శర్వానంద్ రణరంగంలో తన పాత్ర మీద కామెంట్స్ కూడా గట్టిగానే పడ్డాయి. దీని కన్నా ముందు తనే మొత్తం భారం మోసిన సీత డిజాస్టర్ కాగా తమిళ్ లో జయం రవితో చేసిన కోమలి ఫలితం కూడా అంతంతమాత్రంగానే ఉంది.

ఇవి చాలవు అన్నట్టు క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ సెన్సార్ చిక్కుల్లో పడి మిగిలిన బాషల వెర్షన్లకు రాని అబ్జెక్షన్లు దీనికే వచ్చి పడ్డాయి. కొన్ని ముఖ్యమైన కట్స్ తో ఎట్టకేలకు దాన్ని నిర్మాతలు బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సరే ఇన్ని ఉన్నా జరుగుతున్నా కూడా కాజల్ కు మరో లక్కీ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా చెన్నై టాక్.

సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కాజల్ నే ఫిక్స్ చేయవచ్చని వినికిడి. అజిత్ తో వరసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి ఇతర హీరోలకు అందకుండా పోయిన శివ మొదటిసారి ఆ క్యాంప్ నుంచి బ్రేక్ తీసుకుని సూర్యతో ఓకే చేయించుకున్నాడు. శివ గతంలో కార్తీతో చేసిన విక్రమార్కుడు రీమేక్ బ్లాక్ బస్టర్ కావడం వల్లే అక్కడ స్టార్ డైరెక్టర్ గా మారాడు. తెలుగులో స్ట్రెయిట్ గా తీసిన రవితేజ దరువు గోపీచంద్ శౌర్యం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో చెన్నైలో సెటిలైపోయాడు. కాజల్ గతంలో సూర్యతో మాట్రన్ లో నటించింది. ఇప్పుడిది ఓకే అయితే అంతకంటే కావలసింది తనకు ఏముంటుంది.