Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరోయన్ల ఛాన్సులు కాజల్‌ కే

By:  Tupaki Desk   |   29 Aug 2015 9:30 AM GMT
యంగ్‌ హీరోయన్ల ఛాన్సులు కాజల్‌ కే
X
స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే ఫిలాసఫీ, సైకాలజీలో నాలెజ్‌ ఉంటే సరిపోదు. క్యారెక్టర్‌ రీసెర్చ్‌ లో డీప్‌ గా వెళ్లిపోవాలి. అప్పుడే తనని అర్థం చేసుకోగలం. తనని చందమామని చేసిన తెలుగు సినీపరిశ్రమని తూచ్‌ కొట్టేసింది. తంబీల్ని నమ్ముకుని తమిళ్‌ లోకి వెళ్లిపోయింది. అక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు సూర్య - విజయ్‌ - విక్రమ్‌ - ధనుష్‌ ఇలాంటి హీరోలతో మాత్రమే నటిస్తానని పట్టుదలతో అక్కడే కొనసాగుతోంది. టెంపర్‌ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా కన్ఫమ్‌ చేయలేదిక్కడ.

ప్రస్తుతం డీకే అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో నటిస్తోంది. జీవా ఈ చిత్రంలో హీరో. కవటాయ్‌ వేండమ్‌ అనేది టైటిల్‌. డిసెంబర్‌ నుంచి చెన్నయ్‌ లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ కథానాయికగా ఎంపికైంది. జీవా -కీర్తి ఫోటోషూట్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ ఇంతలోనే అనూహ్యంగా కాజల్‌ తో రీప్లేస్‌ చేశారు. కీర్తి వేరొక సినిమాతో బిజీ. డిసెంబర్‌ లో డేట్స్‌ కేటాయించలేకపోయింది. అందుకే ఈ మార్పు అంటూ దర్శకుడు చెబుతున్నాడు. ఏదేమైనా ఇలా యంగ్ హీరోయిన్ల ఛాన్సులు కూడా వదలట్లేదా కాజలూ?

అసలు ఇలా కాజల్‌ చిన్న చిన్న సినిమాలు ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి? తెలుగు హీరోల సరసన నటించవచ్చు కదా! ఇక్కడ పారితోషికం విషయంలో మొండికేయకపోతే కెరీర్‌ పరంగా సమస్యే ఉండేది కాదని మన దర్శకనిర్మాతలు విమర్శిస్తున్నారు. బెట్టు వీడక వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం వల్లే ఇలా తంబీల వెంట పడాల్సొస్తోందని కామెంట్‌ చేస్తున్నారు. అది సంగతి.