Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో చేయాలంటే మనీయే కావాలి

By:  Tupaki Desk   |   31 Aug 2015 5:34 AM GMT
టాలీవుడ్‌ లో చేయాలంటే మనీయే కావాలి
X
అగర్వాల్‌ ఫ్యామిలీస్‌ అంటే బిజినెస్‌ మైండెడ్‌. వ్యాపారం పక్కాగా ఉండాల్సిందే. డీల్‌ కరెక్టుగా సెట్‌ చేయాల్సిందే. లేదంటే పట్టు విడుపు అనేదానికి ఆస్కారమే లేదు. సరిగ్గా ఇదే మైండ్‌ సెట్‌ కాజల్‌ అగర్వాల్‌ ని చిక్కుల్లో పడేస్తోందని టాలీవుడ్‌ లో చెప్పుకుంటున్నారు. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్ని పక్కన పెట్టేసి, తమిళ హీరోల వెంట పడుతోంది.

కాని ట్విస్ట్‌ ఏంటంటే.. అక్కడ స్టార్‌ హీరోలైన విజయ్‌, ధనుష్‌, విశాల్‌ తో చేస్తోంది, అలాగే మామూలు హీరోలు జీవా వంటి వారితోనూ నటించడానికి రెడీ అవుతోంది. ఎటువంటి మోటా చోటా హీరోతోనైనా సయ్‌ అంటోంది. కాని టాలీవుడ్‌ దర్శకనిర్మాతలెవరైనా తనని ఒప్పించాలంటే 1.5 కోట్లు పైగానే పారితోషికం డిమాండ్‌ చేస్తోంది. నో డౌట్‌.. టాలీవుడ్‌ కోలీవుడ్‌ ని మించి రిచ్‌. ఇక్కడ నిర్మాతలు సౌండ్‌ పార్టీలు అని భావించడం వల్లే ఇలా కాజల్‌ పెద్ద మొత్తాల్ని కోట్‌ చేస్తోందని కొందరు ముచ్చటించుకోవడం మీడియాలో చర్చకొచ్చింది.

కాజల్‌ నటించిన టెంపర్‌ రిలీజై ఇప్పటికే 8నెలలు పూర్తయింది. ఇప్పటికి స్టార్‌ హీరోలతో భారీ పారితోషికం ముడితేనే అని ఫిక్సయ్యి ఉంది. మహేష్‌ తో బ్రహ్మూెత్సవం, పవన్‌ తో సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ కి సంతకాలు చేయడానికి కాజల్‌ సిద్ధమైంది అనగానే అందరికీ అసలు విషయంలో క్లారిటీ వచ్చింది. స్టార్‌ హీరోలు అయితేనే భారీ పారితోషికం, అందుకే ఓకే చెబుతోంది మరి.