Begin typing your search above and press return to search.

చంద‌మామ ఒళ్లు మ‌రిచి పుల‌కించెను

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:55 AM GMT
చంద‌మామ ఒళ్లు మ‌రిచి పుల‌కించెను
X
ప్రేమ‌కు చిహ్న‌మైన తాజ్ మ‌హ‌ల్ ని చూసి మురిసిపోని వారుంటారా? ప్ర‌పంచ వింత‌ల్లో ఒక‌టిగా ప్ర‌సిద్ధ‌కెక్కిన తాజ్ మ‌హ‌ల్ ని తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ సంద‌ర్శించింది. తాజ్ ని డైరెక్టుగా విజిట్ చేయ‌డం తొలిసారి కావ‌డంతో షాజ‌హాన్- ముంతాజ్ ల ప్రేమ‌కు చిహ్న‌మైన తాజ్ మ‌హ‌ల్ అందాల‌కు చంద‌మామ ఒళ్లు మ‌రిచి చిందేసింది. తాజ్‌ అందాల‌ని చూసి మైమ‌రిపించిద‌ట‌. దాని అందాల‌ని చూసి పుల‌కించిపోయాన‌ని సంబ‌ర‌ప‌డిపోతూ త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో పంచుకుంది. ఈ సంద‌ర్భంగా తాజ్ అందాల మ‌ధ్య దిగిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుని సంబ‌ర‌ప‌డిపోయింది.

తాజ్ మ‌హాల్ ను తొలిసారి చూసి ఫిదా అయ్యాను. మైమ‌రిపించే ఆ అందాల‌ని చూసిన త‌రువాత నోట మాట రాలేదు. తాజ్ గొప్ప‌త‌నం గురించి తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయాను. నా జీవితంలో చాలా సార్లు తాజ్ గురించి విన్నాను. తాజ్ మ‌హ‌ల్ లోని శిల్ప‌క‌ళ‌.. ధ్వ‌ని త‌దిత‌ర విష‌యాల్ని స్వ‌యంగా ఆస్వాదించా. నా మ‌న‌సులో చెర‌గ‌ని ముద్ర‌వేసింది... అని తెలిపింది.

తాజ్ `వండ‌ర్ ఆఫ్ ది వ‌ర‌ల్డ్‌`అని ఓ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది కాజ‌ల్‌. మొత్తానికి ప్ర‌పంచంలోని ఏడు వింత‌ల్లో ఒక వింత‌ను కాజ‌ల్ ఇలా ఆస్వాదించేసింది. గ‌త కొంత కాలంగా తెలుగు.. త‌మిళ భాష‌ల్లో టాప్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఆమె న‌టించిన సీత‌.. ర‌ణ‌రంగం ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం కాజ‌ల్ `అ!-2`- భార‌తీయుడు-2-ముంబాయి సాగా- పారిస్ పారిస్ చిత్రాల్లో న‌టిస్తోంది.