Begin typing your search above and press return to search.

వైట్ అండ్ వైట్ లో అందాల వేడి

By:  Tupaki Desk   |   30 May 2016 5:52 AM GMT
వైట్ అండ్ వైట్ లో అందాల వేడి
X
ఓ వారం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో కనిపించింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. మహేష్ కి ఓ లిప్ లాక్ వేసి ఆకట్టుకున్న కాజల్.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చిన ఈ భామ.. తను నటించిన హిందీ చిత్రం కోసం ప్రచారం మొదలు పెట్టేసింది.

దో లప్జోం కి కహానీ అనే చిత్రంలో.. రణ్ దీప్ హుడాకి జంటగా నటించింది కాజల్. జూన్ 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్.. ఇప్పుడు టాప్ రేంజ్ కి చేరుకున్నాయి. ఆ కార్యక్రమానికే అమ్మడు ఇంత హాట్ హాట్ గా రెడీ అయిపోయి వచ్చేసింది. స్టైలింగ్ తోనే ఆకట్టుకున్న చందమామ.. తన అందాల ఘాటుతో మరింతగా మెరిసిపోయింది. వైట్ కలర్ డ్రస్.. అమ్మడి అందాలను మరింతగా పెంచిందని చెప్పచ్చు.

కాజల్ స్టైలింగ్ సూపర్ హాట్ గా ఉన్నా.. హెయిర్‌ స్టయిల్ విషయంలో మాత్రం నెగిటివ్ కామెంట్లు పడ్డాయి. పోనీ టైల్ ఈ గెటప్ కి ఏ మాత్రం సూట్ కాలేదని అంటున్నారు. అయితే.. తన బ్యూటీతో ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేసింది కాజల్ అగర్వాల్.