కాజల్ రెచ్చిపోవడానికి అదే కారణం

Wed Jun 13 2018 18:09:40 GMT+0530 (IST)

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ని ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఇష్టపడతారు. చందమామ అంటూ ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. పోటీకి ఎంత మంచి వచ్చినా కూడా తన స్టార్ డమ్ లో ఏ మాత్రం మార్పులు లేకుండా చూసుకుంది. అయితే కాజల్ తన కెరీర్ లో ఈఎప్పుడు లేని విధంగా ఒక కొత్త పని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఏదైనా అవార్డు ఫంక్షన్లు జరిగినప్పుడు స్టార్ హీరోయిన్స్ డ్యాన్సులు చేయడం అనేది చాలా రేర్. హిట్టు కోసం లేదా అవకాశాల కోసం తాపత్రయపడే ముద్దుగుమ్మలు మాత్రమే ఎక్కువగా ఆ తరహాలో స్టెప్పులు వేస్తుంటారు. కానీ కాజల్ మాత్రం రీసెంట్ గా కోలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చేలా ఓ అవార్డు ఫంక్షన్ స్టేజ్ మీద చిందులు వేసింది. విజయ్ అవార్డ్స్ లో మాస్ స్టెప్పులతో వేడుకలో వేడిని రేపింది. గత ఏడాది వరకు కెరీర్ బాగానే సాగినా ఇప్పుడు పెద్ద ఆఫర్స్ అంతగా రావడం లేదు. అందుకే కెరీర్ లో ఎప్పుడు స్టేజ్ లపైనా చిందులు వేయని కాజల్ ఛాన్సులు లేకపోవడంతో ఈ విధంగా ట్రై చేస్తోంది అంటున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం కాజల్ చేతిలో తమిల్ లో ఒక క్వీన్ రీమేక్ మాత్రమే ఉంది. పారిస్ పారిస్ అనే సినిమా హిట్ అయితే కోలీవుడ్ లో అవకాశాలు రావచ్చు. ఇక తెలుగులో రెండు ప్రాజెక్టుల్లో నటించే అవకాశం దొరికింది. అందులో రవితేజ - సంతోష్ శ్రీనివాస్ సినిమాపైనే కాజల్ ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి చందమామ మళ్లీ వెలుగుతుందో లేదో..