Begin typing your search above and press return to search.

ఈ సీత అంతా రివర్స్ లో ఉందే

By:  Tupaki Desk   |   22 May 2019 6:44 AM GMT
ఈ సీత అంతా రివర్స్ లో ఉందే
X
ఇంకో రెండు రోజుల్లో దర్శకుడు తేజ సీత విడుదల కానుంది. మాస్ ఆడియన్స్ కి దీని మీద బాగానే అంచనాలు ఉన్నాయి. మహర్షి తర్వాత సౌండ్ చేసిన సినిమా ఏది లేదు. అల్లు శిరీష్ ఎబిసిడి వచ్చింది కానీ ఫలితం అంత ఆశాజనకంగా లేకపోవడంతో ట్రేడ్ కళ్లన్నీ సీత మీదే ఉన్నాయి. ఈ సారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కన్నా కాజల్ అగర్వాలే మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

దానికి తగ్గట్టే ప్రోమోలు ట్రైలర్లు కట్ చేస్తుండటంతో అంచనాలు తనవల్లనే పెరుగుతున్నాయన్న ఫీలింగ్ కలుగుతోంది. ముఖ్యంగా కాజల్ క్యారెక్టర్ ని హై లైట్ చేస్తూ వదిలిన ఫ్రెష్ ట్రైలర్ లో ఓ గూండాని కాజల్ యెగిరి కాలితో తన్నే సన్నివేశం బాగా వైరల్ అవుతోంది. దీన్ని బట్టే సీత పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతోందో తేజ క్లూ ఇచ్చేశారు

అంచనాలు మరీ ఆకాశాన్ని తాకే రేంజ్ లో లేకపోయినా సీత పబ్లిక్ అటెన్షన్ ని బాగానే రాబడుతోంది. దీన్ని నిలబెట్టుకునే కంటెంట్ కనక సినిమాలో ఉంటే మంచి రన్ దక్కించుకోవచ్చు. పైగా వచ్చే వారం డబ్బింగ్ సినిమా ఎన్జికె తప్ప పెద్ద పోటీ ఏమి లేదు. ఇది మంచి అవకాశం. ఎలాగూ ఇదే టైం వస్తుందనుకున్న అర్జున్ సురవరం ఇంకాస్త ముందుకు వెళ్లడంతో సీతకు సోలో ఫైట్ దొరికింది.

ఇప్పటి దాకా తన స్థాయికి మించిన హీరోయిజంతో విజయానికి ఆమడ దూరంలో ఆగిపోయిన సాయి శ్రీనివాస్ కాజల్ పాత్ర డామినేషన్ ఉంటుందని తెలిసే ఒప్పుకున్నాడు అంటే కథలో ఏదో గట్టి మ్యాటర్ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రోమో మెటీరియల్ ని బట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేం కానీ ఎల్లుండి ఈ సమయానికి సీత జాతకం తేలిపోయి ఉంటుంది. చూద్దాం