Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: కార్తీ మ‌రో యాంగిల్‌

By:  Tupaki Desk   |   8 Oct 2019 4:12 AM GMT
ట్రైల‌ర్ టాక్‌: కార్తీ మ‌రో యాంగిల్‌
X
రియ‌లిస్టిక్ ఫిల్మ్ `ఖాకీ`(ధీర‌న్ అధికారం ఒండ్రు) త‌రువాత కార్తీకి ఆ స్థాయి విజ‌యం ద‌క్క‌లేదు. తాజాగా కార్తి న‌టిస్తున్న మ‌రో రియ‌లిస్టిక్ మూవీ `ఖైదీ` (ఖైథీ-త‌మిళ్‌). `మాన‌గ‌రం`లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖాకీ`ప్రొడ్యూస‌ర్స్ ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెరీర్ తొలి నాళ్ల‌లో ప‌రుత్తివీర‌న్‌.. యుగానికొక్క‌డు వంటి చిత్రాల్లో కార్తీ చాలా ర‌గ్గుడ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించాడు. ఆ చిత్రాల త‌రువాత ఊర‌మాస్ పాత్ర‌లో శిక్ష ప‌డ్డ ఖైదీగా కార్తి ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడు. డ్ర‌గ్స్ మాఫియా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి మ‌రో ప్ర‌త్యేక‌త వుంది. కార్తి ఈ సినిమాతో మ‌రో ప్ర‌యోగానికి తెర‌లేపాడ‌ని చెప్పొచ్చు. ఇందులో హీరోయిన్ వుండ‌దు. హీరోయిన్ లేకుండా తెర‌కెక్కుతున్న తొలి సినిమా కూడా ఇదే.

ఇటీవ‌ల విడుద‌ల టీజ‌ర్ లో కార్తి గుబురు గ‌డ్డం.. మెలితిరిగిన మీనం క‌ట్టుతో చాలా ర‌గ్గుడ్ పాత్ర‌లో క‌నిపించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డ్ర‌గ్స్ మాఫియా భారీ నుంచి శిక్ష‌ప‌డిన ఓ ఖైదీ ఎలా కాపాడాడు. వంద‌ల మందిని ఎలా ఎద‌రించాడ‌న్న‌ది ఈ చిత్ర క‌థ‌గా తెలుస్తోంది. రీసెంట్‌గా చిత్ర బృందం ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసింది. ఓ చేతికి భేడీల‌తో పోలీస్ ఆఫీస‌ర్ ని అంత‌మొందించ‌డానికి ఎదురుప‌డే అల్ల‌రి మూక‌ల్ని ఒంటిచేత్తే కార్తి మ‌ట్టి క‌రిపిస్తున్న తీరు చాలా ఇంటెన్సీవ్ గా వుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఎక్క‌డా క‌నిపించ‌క‌పోయినా సినిమాని ద‌ర్శ‌కుడు చాలా గ్రిప్పింగ్ గా న‌డిపించిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. కార్తీ కెరీర్ లో మ‌రో ప‌క్కా మాస్ చిత్రంగా ఖైదీ నిల‌వ‌నుంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

కార్తీ సినిమాతో పాటుగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బిగిల్ (విజిల్ -తెలుగు).. విజయ్ సేతుప‌తి న‌టించిన వేరొక సినిమా పోటీబ‌రిలో ఉన్నాయి. మ‌రి భారీ కాంపిటీష‌న్ లో కార్తి `ఖైదీ` (ఖైథీ-త‌మిళ్‌) ఎలాంటి విజ‌యం అందుకోబోతోంది? అన్న‌ది చూడాలి.