Begin typing your search above and press return to search.

నిన్న రిలీజ్.. నేడు ఆన్ లైన్లోకి

By:  Tupaki Desk   |   3 Dec 2016 4:00 PM GMT
నిన్న రిలీజ్.. నేడు ఆన్ లైన్లోకి
X
ఈ మధ్య పైరసీ భూతం కొంచెం నెమ్మదింది. పైరసీ ప్రింట్లను పెట్టే వెబ్ సైట్ల మీద కేంద్ర ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించడంతో గత కొన్ని నెలల్లో పైరసీ కొంత వరకు తగ్గుముఖం పట్టింది. పైరసీ టొరెంట్లను పెట్టే టొరెంట్జ్.. కిక్ యాస్ లాంటి వెబ్ సైట్లకు పంచ్ పడటం సినీ పరిశ్రమకు పెద్ద ఊరటే. ఐతే ఇలాంటి ఎన్ని నిరోధక చర్యలు చేపట్టినా.. మరోవైపు పైరసీ కోసం వక్ర మార్గాలు తొక్కే వాళ్లు ఆగరు. అలా కొన్ని సినిమాలు ఇప్పటికీ పైరసీ బారిన పడుతూనే ఉన్నాయి. తాజాగా విద్యాబాలన్ సినిమా ‘కహాని-2’కు పైరసీ పంచ్ పడింది.

‘కహాని-2’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాగా.. వెంటనే ఈ సినిమాను పైరసీ చేసేశారు. రెండో రోజుకే ఆన్ లైన్లో పైరసీ విస్తృతం అయింది. ఐతే ప్రింట్ క్వాలిటీ సరిగా లేకపోవడం కొంత వరకు నిర్మాతకు ఊరట కలిగించే విషయం. అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ కొంత వరకు జరిగింది. కహాని-2 అనే పేరు పెట్టుకున్నప్పటికీ ఇది కహానికి సీక్వెల్ కాదు. సుజాయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘కహాని-2’లో విద్యా బాలన్ ప్రధాన పాత్ర పోషించింది. అర్జున్ రాంపాల్ కీలక పాత్ర చేసింది. ఐతే మంచి అంచనాల మధ్య రిలీజైన ‘కహాని-2’కు యావరేజ్ రివ్యూలు వచ్చాయి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/