Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సస్సెన్స్ తో ఇరగదీశారుగా

By:  Tupaki Desk   |   25 Oct 2016 11:52 AM GMT
ట్రైలర్ టాక్: సస్సెన్స్ తో ఇరగదీశారుగా
X
''నేను బ్రతికున్నంత కాలం.. నీకేం అవ్వదు'' అనే సింగిల్ పాయింట్ మీద రూపొందిన సస్సెన్స్ థ్రిల్లర్ ''కహానీ 2''. చాలా రోజుల నుండి ఈ సినిమా ప్రీ రిలీజ్ పోస్టర్లు అలాగే ఫస్ట్ లుక్ కూడా అలరిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజైంది. పదండి అసలు కథేంటో చూద్దాం.

కహానీ మొదటి భాగంలో తన మొగుడ్ని వెతుక్కుంటూ వచ్చి.. ఒక టెర్రరిస్టును చంపేసే పాత్రలో విద్యా బాలన్ ఇరగదీసింది. అందుకే దర్శకుడు సుజయ్ ఘోష్‌ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తరహాలో.. ''కహానీ 2'' అంటూ తెరకెక్కించాడు. అయితే ఈసారి సినిమాను కోలకతా బ్యాక్ డ్రాప్ లో కాకుండా.. వేరే హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో తీశారు. విద్యా బాలన్ కు ఒక ఘోర ప్రమాదం జరగడం.. ఆమె కథను పోలీస్ ఆఫీసర్ అర్జున్ రాంపాల్ చదివి తెలుసుకోవడం.. అసలు ఆమె కూతురుకు ఏమైంది అనే సస్సెన్స్.. అలాగే ఆమె స్నేహితులు ఎవ్వరూ ఆమె చెప్పే విషయాలను నమ్మకపోవడం.. అబ్బో మరో కిడ్నాప్ స్టోరీలా ఉన్నా కూడా.. సస్పెన్స్ మాత్రం అదిరింది.

లేడీ సెంట్రిక్ ఫిలింస్ అనే పదానికి బాలీవుడ్ లో కొత్త అధ్యాయం మొదలైంది మాత్రం విద్యా బాలన్ మూవీస్ తోనే. కాబట్టి ఈ సినిమాకు కూడా మరోసారి ఎక్సపెక్టేషన్లకు అందకుండా అదరగొట్టేస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. లెటజ్ సీ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/