టీజర్: కదం తొక్కిన చియాన్

Wed Jan 16 2019 14:25:40 GMT+0530 (IST)

చియాన్ విక్రమ్ యూనిక్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనేలేదు. విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత అన్ని ప్రయోగాలు చేసింది విక్రమ్ అంటే అతిశయోక్తి కాదు. అపరిచితుడుగా శివపుత్రుడుగా నాన్నగా అతడి నటనను పదే పదే అభిమానులు తలచుకుంటారు. అందుకే గత నాలుగేళ్లుగా సక్సెస్ అన్నదే లేకపోయినా విక్రమ్ ఏ సినిమాలో నటించినా అందరిలోనూ ఏదో తెలియని ఆసక్తి. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడి అభిమానులు థియేటర్లకు వెళుతున్నారు.విక్రమ్ నటించిన తాజా చిత్రం `కదరం కందన్` ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చియాన్ కొత్త లుక్ లో స్ట్రైకింగ్ గా కనిపిస్తున్నాడు. రగ్గ్ డ్ ఆఫీసర్ గా.. నెరిసిన గడ్డంతో గన్ ఎక్కిపెట్టి జూలు విదులుస్తున్నాడు. భారీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాతో ఈసారి మైమరిపించేందుకు వస్తున్నాడని అర్థమవుతోంది.

ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. రాజ్ కమల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎం.సెల్వ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ బ్యానర్ లో ఇదివరకూ రిలీజైన చీకటి రాజ్యం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.  విక్రమ్ - అక్షర హాసన్- అభి హాసన్ (నాజర్ కుమారుడు) తదితరులు నటిస్తున్న ఈ సినిమా(కదరం కందన్) ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రానికి గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరిందని టీజర్ చెబుతోంది.