కబీర్ @ 100 కోట్లు

Tue Jun 25 2019 11:51:03 GMT+0530 (IST)

బాలీవుడ్ మీడియా ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరీ ట్రాలింగ్ చేసినా కబీర్ సింగ్ మీద దాని ప్రభావం కించిత్ కూడా లేదు. షాహిద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ రికార్డులకే ఎసరు పెడుతోందీ సినిమా. ఇప్పటికే 4 రోజుల రన్ పూర్తి చేసుకున్న కబీర్ సింగ్ ఇవాళ  మొత్తంగా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేయబోతున్నట్టుగా ట్రేడ్ రిపోర్ట్.సాధారణంగా డ్రాప్ ఎక్కువగా ఉంటుందని భావించే సోమవారం సైతం 18 కోట్ల దాకా రాబట్టడం చూసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు. ఎందుకంటే సల్మాన్ లాంటి హీరోనే మండే కలెక్షన్ ని 16 కోట్లకు మించి రాబట్టిన సందర్భం లేదు. అలాంటిది షాహిద్ కపూర్ లాంటి మీడియం రేంజ్ హీరోతో ఈ ఫీట్ అంటే మాటలా. ఇప్పుడు ఇదే టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ముంబై విమర్శకులకు నోట మాట రావడం లేదు.

ఇవాళ్టి సెకండ్ షో పూర్తయ్యే సమయానికి కబీర్ సింగ్ అఫీషియల్ గా హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి అడుగు పెట్టేస్తుంది. దీని దూకుడు చూస్తుంటే జనవరిలో వచ్చిన బ్లాక్ బస్టర్ యుఆర్ ఐని టార్గెట్ చేసినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్టార్ సపోర్ట్ లేకుండా యుఆర్ ఐ ఫైనల్ రన్ లో 225 కోట్ల దాకా రాబట్టింది. కబీర్ సింగ్ ఇదే దూకుడుని కొనసాగిస్తే అది చేరుకోవడం పెద్ద కష్టం కాదు. పోటీ కూడా పెద్దగా లేదు కాబట్టి ఈజీగా చేరుకోవచ్చు. వర్మ తర్వాత తెలుగు వాడి సత్తాను చాటిన కబీర్ సింగ్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ఆనందం గురించి ఇంకా చెప్పేదేముంది