క్రిటిక్స్ ని డిఫెన్స్ లో పడేసిన కలెక్షన్స్

Mon Jun 24 2019 12:37:25 GMT+0530 (IST)

బాలేదన్నారు. లవ్ స్టోరీని ఇలా కూడా తీస్తారా అని విమర్శించారు. సౌత్ దర్శకుడి సినిమా కాబట్టి ఎంత దుమ్మెత్తి పోయాలో అంతా చేశారు. కానీ కబీర్ సింగ్ తీర్పుని ఏమార్చలేకపోయారు. మొన్న శుక్రవారం విడుదలైన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. అందిన సమాచారం మేరకు వీక్ ఎండ్ అయ్యాక సుమారుగా 70 కోట్ల దాకా వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఇప్పటిదాకా షాహిద్ కపూర్ నటించిన ఏ భారీ చిత్రానికి ఇంత వసూళ్లు రాలేదు. ట్రేడ్ సైతం ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతోంది.లెక్కలేనన్ని విమర్శలు ముంబై మీడియా కురిపించినప్పటికీ ప్రేక్షకులు వాటిని లెక్క చేయడం లేదు. మెట్రో సిటీస్ లో ఇవాళ సోమవారం కూడా చాలా  స్టడీగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫైనల్ గా కబీర్ సింగ్ కు బ్లాక్ బస్టర్ స్టేటస్ వచ్చేసింది. వసూళ్లు ఎక్కడిదాకా వెళ్తాయి అనే దాన్ని బట్టి టాప్ 3 లో ఏ చోటు దక్కుతుంది అనేది తేలుతుంది.

కియారా అద్వానీ పాత్రను డిజైన్ చేసిన తీరు హీరో స్వభావాన్ని బట్టి కొంత బోల్డ్ గా చూపించిన ఎపిసోడ్స్ నే విమర్శకులు టార్గెట్ చేశారు. నిజానికి ఇవి అంత ఆక్వర్డ్ గా లేవు. ఇంత కన్నా ఘాటు రొమాన్స్ సెక్స్ ని స్టార్లు చేసినప్పుడు మెచ్యూరిటీ ట్రెండ్ అని భజన చేసిన ఇదే మీడియా ఇప్పుడు ఒక్క కబీర్ సింగ్ ని మాత్రమే టార్గెట్ చేయడం పట్ల నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం  చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈజీగా వంద కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది