Begin typing your search above and press return to search.

చెట్టినాడ్ ప్రిన్స్.. షూటింగ్‌ ఆపేశాడు

By:  Tupaki Desk   |   4 Oct 2015 6:46 AM GMT
చెట్టినాడ్ ప్రిన్స్.. షూటింగ్‌ ఆపేశాడు
X
ఎంత స్టార్‌ డ‌మ్ ఉన్న హీరో అయినా ఒక్కోసారి ఫూల్ అవ్వాల్సి వ‌స్తుంది. నేను పెద్ద హీరో .. న‌న్నెవ‌ర ఆప‌లేరు... అంటే కుద‌ర‌దు. ముఖ్యంగా వెండితెర‌పై చూపించిన హీరోయిజం చాలా సంద‌ర్భాల‌లో రియ‌ల్ లైఫ్‌ లో చూపించ‌డం కుద‌ర‌దు. నేను ర‌జ‌నీకాంత్ ... నేను చిరంజీవి.. నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెప్పినా .. అవ‌త‌లివాడు మొండి మ‌రాఠా అయితే అంతే ముప్పుతిప్ప‌లు త‌ప్ప‌వు.

స‌రిగ్గా అలాంటి సంద‌ర్భాన్నే సూప‌ర్‌ స్టార్‌ ర‌జ‌నీకాంత్ కి ఎదురైంది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ హీరోగా పి.ఎ.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌బాలి షూటింగ్ జ‌రుగుతున‌న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చెన్న‌య్‌ లోని చెట్టినాడ్ ప్యాలెస్ ప‌రిస‌రాల్లో షూటింగ్ చేస్తున్నారు. అయితే అక్క‌డ అనూహ్య సంఘ‌ట‌న‌. చెట్టినాడ్ ప్రిన్స్‌ గా పిల‌వ‌బ‌డే ఎంఎఎంఆర్ ముత్త‌య్య ఈ భ‌వంతి వ‌ద్ద షూటింగ్ చెయ్యొద్దు. ఇది నా ప్లేసు అంటూ గొడ‌వ‌పెట్టుకున్నాడు. ర‌జ‌నీ షూటింగ్ అని చెప్పినా విన‌లేదు. అయితే చెట్టినాడ్ ప‌రిస‌రాల‌లో షూటింగుకి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ఉంద‌ని చెప్పినా అత‌డు నిరాక‌రించాడు. అవ‌త‌లివాడు ఎంత‌టివాడు అనేది నాకు అన‌వ‌స‌రం అన్న‌ట్టే ఎదురు తిరిగాడు.

దీంతో షాకైన ర‌జ‌నీకాంత్ త‌న ఇన్‌ ఫ్లూయెన్స్ ఉప‌యోగించి చివ‌రికి ఏదోలా రాజీ కుదుర్చుకున్నాడ‌ని టాక్‌. అదీ సంగ‌తి.