Begin typing your search above and press return to search.

వీకెండ్ కే 4 మిలియన్లు దాటేశాడు

By:  Tupaki Desk   |   25 July 2016 7:05 AM GMT
వీకెండ్ కే 4 మిలియన్లు దాటేశాడు
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కబాలి.. యూఎస్ లో చాలానే చరిత్రలు రాసేస్తోంది. ప్రీమియర్స్ కలెక్షన్స్ లో బాహుబలిని మించిపోయిన కబాలి.. వారాంతం వరకూ కలెక్షన్స్ చూసుకుంటే రెండో స్థానంలో నిలిచింది. ఒక మిలియన్ కలెక్షన్ నే గ్రాండ్ అనుకునే సమయంలో.. వీకెండ్ నాటికే 4 మిలియన్లను రాబట్టి సత్తా చాటాడు రజినీకాంత్.

ఆదివారంల వరకూ తెలుగు - తమిళ్ వెర్షన్స్ కు కలిపి.. 4.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది కబాలి. ఇందులో తెలుగు కంటే తమిళ్ వెర్షన్ కలెక్షన్స్ ఎక్కువగా ఉండడం విశేషం. అటు రజినీకాంత్ సినిమాల్లోనూ.. ఇటు తమిళ్ మూవీస్ లోనే కాకుండా.. సౌత్ రికార్డును సృష్టించేసింది కబాలి. ఈ చిత్రానికి వీకెండ్ వరకూ కలెక్షన్స్ చూసుకుంటే.. రెండో స్థానంలో నిలవవడం విశేషం. మొదటి వారాంతానికి 4.5 మిలియన్ల వసూళ్లతో బాహుబలి మొదటి స్థానంలో ఉంది.

రజినీకాంత్ మినహాయిస్తే.. వేరే ఏ ఆకర్షణ లేని మూవీ కబాలి. అలాంటి సినిమా 4 మిలియన్ల మార్కును మూడు రోజుల్లో అందుకోవడం పెద్ద రికార్డే. అయితే.. ఇందులో రెండు మిలియన్స్ ప్రీమియర్ల ద్వారా వచ్చినవే. వీకెండ్ ముగిశాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయనే అంచనాలున్నాయి.