Begin typing your search above and press return to search.

కబాలికి కూడా తప్పలేదు..

By:  Tupaki Desk   |   24 July 2016 10:31 AM GMT
కబాలికి కూడా తప్పలేదు..
X
ఈ మధ్య పెద్ద సినిమాలకు కొంచెం నెగెటివ్ టాక్ రాగానే అప్రమత్తం అయిపోతున్నారు దర్శక నిర్మాతలు. వెంటనే కత్తెరకు పని చెప్పేస్తున్నారు. ప్రేక్షకులకు ఎక్కడ లాగ్ అనిపించిందో ఫీడ్ బ్యాక్ తెలుసుకుని కోత వేయడానికి వెనుకాడట్లేదు. బ్రహ్మోత్సవం.. 24 సహా ఈ మధ్య చాలా సినిమాలకు విడుదల తర్వాత కోత పడింది. ఇప్పుడు కబాలి విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా నిడివిని 12 నిమిషాలు తగ్గిస్తున్నారు. ప్రథమార్ధంలో ఐదు నిమిషాలు.. ద్వితీయార్ధంలో దాదాపు ఏడు నిమిషాలు కోత విధించినట్లు తెలిసింది. ట్రిమ్డ్ వెర్షన్ సోమవారం నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారు.

ఆదివారం వరకు బుకింగ్స్ ఫుల్ గా ఉండటంతో ట్రిమ్ చేయడానికి తొందర పడలేదు. సోమవారం నుంచి కలెక్షన్లు డ్రాప్ అయ్యే అవకాశముంది కాబట్టి కాస్త ట్రిమ్ చేసి.. ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ రాకుండా చేయాలని భావించారు. ఐతే ఇండియాతో పాటు ఇంకో 12 దేశాల్లో మాత్రమే కబాలి ట్రిమ్డ్ వెర్షన్ ప్రదర్శితమవుతుంది. మిగతా దేశాల్లో ఇప్పుడున్నట్లే రెండున్నర గంటల నిడివి ఉంటుంది. ‘కబాలి’లో చాలా సన్నివేశాలు సాగతీతలా అనిపించాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో రజినీ.. తన భార్యను వెతుకుతూ ఇండియాకు వచ్చే ఎపిసోడ్ మరీ సాగతీతలా అనిపిస్తుంది. ఈ విషయంలో పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో కోత తప్పలేదు. ఐతే ఇలా నిడివి తగ్గించినంత మాత్రాన ‘కబాలి’ మీద జనాల అభిప్రాయం మారిపోతుందా అన్నది సందేహమే.