Begin typing your search above and press return to search.

బాహుబలిని బీట్‌ చేసిన కబాలి

By:  Tupaki Desk   |   22 July 2016 7:25 AM GMT
బాహుబలిని బీట్‌ చేసిన కబాలి
X
అనుకున్నంతా అయింది.. సూపర్ స్టార్ వచ్చీ రావడంతోనే ఫస్ట్ పంచ్ వేసేశాడు. కబాలి అంటూ రజినీకాంత్ చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఇంటర్నేషనల్ గా అభిమానులందరినీ ఊపేస్తున్నాడు. ఈ తుఫాన్ లో చాలా రికార్డులు కొట్టుకుపోవడం ఖాయమని ముందే అర్ధమైపోయింది. అయితే.. అందరినీ ఊరించిన డౌట్ ఏంటంటే.. టాలీవుడ్ జక్కన్న తీసిన బాహుబలి సృష్టించిన సంచలనాలకు రజినీకాంత్ అధిగమించగలడా అనే క్వశ్చన్ ఊరించింది.

అలాంటి డౌట్స్ ఏమీ అవసర్లేదని.. తన ముందు ఏ బాహుబలి అయినా ఒకటే అని ప్రూవ్ చేసేశాడు రజినీకాంత్. తన పేరుకు ఉన్న పవర్ మందు ఎలాంటి రికార్డులయినా తక్కువే అని నిరూపించేశాడు. అవును మరి.. బాహుబలి లాంటి భారీ కాన్వాస్.. ఏళ్ల తరబడి కష్టంతో తీసిన మూవీ.. యూఎస్ ప్రీమియర్ల ద్వారా వసూలు చేసిన మొత్తం 13,95,309 డాలర్లు. ఈ మార్క్ ని అందుకోవడం ఇంకే స్టార్ హీరోకయినా అసాధ్యమేమో కానీ.. రజినీకాంత్ మాత్రం అలవోకగా దాటేశాడు.

కబాలి మూవీకి యూఎస్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన మొత్తం 1.45 మిలియన్ డాలర్లు. అంటే బాహుబలి ది బిగినింగ్ ని మంచి మార్జిన్ తోనే క్రాస్ చేశాడన్న మాట. బాహుబలి 2 తప్ప వేరే ఏ సినిమా టచ్ చేయలేని రికార్డులు అనుకుంటున్న సమయంలో.. సింగిల్ గా వచ్చి ఫస్ట్ పంచ్ వేసేశాడు కబాలి.