Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: నాటీ ఆర్జేగా మారిన జ్యోతిక

By:  Tupaki Desk   |   20 Sep 2018 3:46 PM GMT
టీజర్ టాక్: నాటీ ఆర్జేగా మారిన జ్యోతిక
X
సీనియర్ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'కాట్రిన్ మొళి'. 2017 లో రిలీజ్ అయిన బాలీవుడ్ హిట్ 'తుమ్హారీ సులు' కి తమిళ రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధామోహన్ తెరకెక్కిస్తున్నాడు. హిందీలో విద్యాబాలన్ నటించిన రేడియో జాకీ పాత్రలో జ్యోతిక నటిస్తోంది. ఇక విదార్థ్.. లక్ష్మి మంచు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ హీరో శింబు ఒక క్యామియో పాత్రలో కనిపిస్తాడు.

ఈ సినిమా టీజర్ ను ఫిలింమేకర్స్ కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఒక గృహణి అనుకోకుండా ఎఫ్ ఎం ఛానల్ ఆర్జే కావడం.. ఆ ఛానెల్ లో లేట్ నైట్ ప్రసారమయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం.. అది సక్సెస్ కావడం జరుగుతుంది. దీని చుట్టూ తిరిగే ఫన్నీ సంఘటనలే సినిమా స్టొరీ. తమిళంలో కూడా పెద్దగా మార్పులు లేకుండా ఒరిజినల్ టెంప్లేట్ నే ఫాలో అయినట్టుగా ఉన్నారు.

ఒక నిముషం కన్నా తక్కువ నిడివి ఉన్న టీజర్ స్టార్ట్ లోనే జ్యోతికకు మంచు లక్ష్మి 'హలో ' అని హస్కీ గా చెప్పాలి అంటుంది. ఇక జ్యోతిక 'హలో'.. 'హా.. లో' .. 'హ్ లో' అంటూ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్ లో చెప్తూ ప్రాక్టిస్ చేస్తూ ఉంటుంది.. హస్కీగా సెన్సువల్ గా రావాలనే ఉద్దేశంతో 'హలో' ను ప్రతి ఒక్కరితో అలా చెప్తూ ఉంటుంది. సెక్సీ గా ఫోన్ లో హలో చెప్తే అవతలివాడు షాక్ అవుతాడు కదా..! అలాగే జరుగుతుంది. ఇక విజయలక్ష్మి పాత్ర పోషిస్తున్న జ్యోతిక హలో ఎఫ్ ఎం లో ఉద్యోగం కోసం వెళ్తే అక్కడ 'ఉంగళకు ఆర్జే ఆగణుమా.. రొంబనాల ఆసయో?(మీకు ఆర్జే కావాలనుందా చాలా రోజుల నుంచి ఉన్న కోరికా?) అని అడిగితే "ఇల్ల.. ఇప్పో పత్తు నిముషమాదా"(లేదు.. ఈ పది నిముషాలనుండే.!) అంటూ షాక్ ఇస్తుంది.

టీజర్ అంతా జ్యోతిక ఫుల్ యాక్టివ్ గా కనిపించింది. తన వయసుకు తగ్గట్టే మధ్య వయసు హౌస్ వైఫ్ పాత్రకు కరెక్ట్ గ సూట్ అయింది. ఇక తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం. ఈ సినిమా అక్టోబర్ 18 న రిలీజ్ కానుంది. హ.. ల్.. ఓ.. ఆ.. లో.. పు.. టీ.. జ ...ర్.. చూ.. డం.. డి...!