Begin typing your search above and press return to search.

బిచ్చగాడి సెంటిమెంట్ తో కాశి

By:  Tupaki Desk   |   23 March 2018 7:07 PM GMT
బిచ్చగాడి సెంటిమెంట్ తో కాశి
X
సినిమా కాన్సెప్ట్ బావుంటే ఆ సినిమా ఎవరిది అనే విషయం తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకోరు. అనువాద చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంటాయని మొదట కోలీవుడ్ సినిమాలే రుజువు చేశాయి. ఇకపోతే బిచ్చగాడు సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అంథోని మరొక కొత్త తరహా కథని టచ్ చేశాడు. కాశీ అనే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

రీసెంట్ గా చిత్రం న్యూ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే బిచ్చగాడు తాలూకు మదర్ సెంటిమెంట్ ఇందులో క్లారిటీగా కనిపిస్తోంది. కానీ ఆ సెంటిమెంట్ తో పాటు థ్రిల్లర్ యాక్షన్ లవ్ స్టోరీ మరియు పునర్జన్మ వంటి అంశాలు సినిమాలో కనిపిస్తున్నాయి. ట్రైలర్ బాగానే ఉన్నా ఎండింగ్ లో రొటీన్ గా ఉంది. హీరోయిన్స్ అంజలి - సునయన పాత్రలు కీలకంగా అనిపిస్తున్నా అందరిని ఆకట్టుకుంటాయ అనేది డౌట్. విజయ్ అంథోని బిచ్చగాడు తరువాత ఆ రేంజ్ లో హిట్టు అందుకోలేదు.

మరి ఈ సినిమాతో అయినా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. చూస్తుంటే సరికొత్త గేటప్పుల్లో కనిపిస్తున్నాడు కావున పాజిటివ్ టాక్ వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ ముందు ప్రభావం చూపవచ్చని టాక్. ఇక ఈ సినిమాకు ఉదయనిది దర్శకత్వం వహించగా విజయ్ అంథోని సతీమణి ఫాతిమా అంథోని నిర్మాతగా వ్యవహరించారు. సొంత బ్యానర్ లోనే విజయ్ ఈ సినిమాను చేశాడు. ఇక ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకలు చేస్తున్నారు.