Begin typing your search above and press return to search.

కాష్మోరా.. ఇంతకంటే బంపరాఫర్ ఉంటుందా?

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:46 AM GMT
కాష్మోరా.. ఇంతకంటే బంపరాఫర్ ఉంటుందా?
X
తెలుగునాట ఏదైనా పెద్ద పండగొచ్చిందంటే చాలు.. సినిమా వాళ్లు పండగ చేసుకుంటారు. ఏడాది ఆరంభంలో సంక్రాంతికి.. ఈ మధ్య దసరాకు సినిమా ఉత్సవం ఎలా జరిగిందో తెలిసిందే. ఐతే సంక్రాంతి.. దసరాల్లాగే దీపావళి కూడా మనకు పెద్ద పండగే. గతంలో ఈ పండక్కి కూడా పెద్ద సినిమాల్ని రిలీజ్ చేసేవాళ్లు. ఐతే ఈ మధ్య దీపావళిని పట్టించుకోవడం మానేశారు. అందులోనూ ఈ ఏడాదైతే కాస్త పేరున్న సినిమా ఒక్కటీ లేదు. మంచు లక్ష్మి సినిమా ‘లక్ష్మీ బాంబు’ను ముందు దీపావళికే అన్నారు. కనీసం అదైనా బరిలో ఉంటుందంటే.. దాన్ని కూడా వాయిదా వేసేశారు. మిస్టర్ 420 అని.. చల్ చల్ గుర్రం అని రెండు సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటిని జనాలు పట్టించుకోవడం డౌటే.

దీంతో కార్తి నటించిన తమిళ మూవీ ‘కాష్మోరా’ మీదే ఫోకస్ మొత్తం నిలిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్లలో రిలీజవుతోంది. ఇలా ఓ డబ్బింగ్ మూవీ పోటీ లేకుండా భారీ స్థాయిలో రిలీజవడం అరుదైన విషయం. పైగా ముందు వారం వచ్చిన ‘ఇజం’ కూడా జోరు తగ్గించేయడం.. పోటీగా రిలీజ్ కావాల్సిన మరో తమిళ డబ్బింగ్ మూవీ ‘ధర్మయోగి’ ఒక రోజు వాయిదా పడటంతో కార్తికి మామూలుగా కలిసి రావట్లేదు. ఓ మీడియం తెలుగు సినిమా స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.. వీకెండ్లో ఎలాంటి వసూళ్లు రాబట్టుకుంటుందో చూడాలి. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/