Begin typing your search above and press return to search.

ఈ సినిమా కూడా కాపీయేనా?

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:20 AM GMT
ఈ సినిమా కూడా కాపీయేనా?
X
కాపీ క్యాట్‌ లు అనే పదం టాలీవుడ్‌ లో బాగా ఫేమస్‌. ఏ హాలీవుడ్‌ నుంచో, బాలీవుడ్‌ నుంచో కాపీ కొట్టేసినదేనని చెబుతుంటారు. కొన్ని పాయింట్లను, కొన్ని సీన్లను లేదా ఏకంగా సోల్‌ ఆఫ్‌ ది మూవీ కాపీ కొట్టేసి, దానికి మనదైన కల్చర్‌ ని యాడ్‌ చేసి సినిమా తీయడం వల్లే చాలా సినిమాలు విమర్శకుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సొచ్చిందని చెబుతుంటారు. అలాంటి వాటిలో వెతికితే పెద్ద జాబితానే ఉంది. ముఖ్యంగా కోలీవుడ్‌ లో రంగం, రోబో, ఆడుకళం, ఆటోగ్రాఫ్‌, మురాన్‌ .. ఇలా సినిమాలన్నీ ఇన్‌ స్పిరేషన్‌ తో వచ్చినవేనని ఆయా చిత్రాల దర్శకులు చెబుతున్నా .. అవన్నీ కాపీలేనని క్రిటిక్స్‌ తేల్చిపారేస్తున్నారు. అంతేనా

స్టేట్‌ ఆఫ్‌ ప్లే అనే సినిమా థీమ్‌ని కొట్టేసి కె.వి.ఆనంద్‌ రంగం సినిమా తీశాడని చెబుతుంటారు. అంతేకాదు పైన చెప్పిన సినిమాలన్నీ ఆస్కార్‌ కోసం ప్రయత్నించినవే.

ఓ స్నేహితుల బృందం బెటర్‌ సొసైటీ కోసం ప్రయత్నిస్తుంటుంది. అందులో ఓ స్నేహితుడిని రాజకీయ నేతగా తీర్చిదిద్దేందుకు తపిస్తుంటారంతా. అయితే అతడు ఉన్నట్టుండి తన పబ్బం గడుపుకోవడానికి, నేతగా ఎదగడానికి తనను నమ్మిన స్నేహితుల్నే నట్టేట ముంచేస్తాడు. చివరికి సిసలైన రాజకీయనేత అనిపించుకుంటాడు. ఇదంతా హాలీవుడ్‌ చిత్రం స్టేట్‌ ఆఫ్‌ ప్లే కథాంశం. దీన్నే లైన్‌ గా తీసుకుని రంగం చిత్రాన్ని తెరకెక్కించాడు కే.వీ.ఆనంద్‌. అందుకే ఈ సినిమా ఆస్కార్‌ బరిలోకి వెళ్లాలని ప్రయత్నించినా ఎంట్రీ స్థాయికి కూడా వెళ్లలేకపోయిందని విమర్శిస్తుంటారు.

రంగం తెలుగువారిని బాగా మెప్పించిన సినిమా. ఎందుకంటే అంతకంటే ముందు ఆ తరహా కథాంశంతో ఇక్కడ మనవాళ్లు సినిమా తీయలేకపోయారు. కానీ ఈ రంగం వెనక ఇంత కథ ఉందని తెలిస్తే మనవాళ్లు అవాక్కవ్వడం ఖాయం.