Begin typing your search above and press return to search.

కంచరపాలెం కోసం కేటీఆర్‌ చొరవ - ఎంట్రీకి ఓకే

By:  Tupaki Desk   |   13 Jan 2019 5:20 AM GMT
కంచరపాలెం కోసం కేటీఆర్‌ చొరవ - ఎంట్రీకి ఓకే
X
ఇండియాలో నిర్మాణం జరిగే ప్రతి సినిమాకు కూడా జాతీయ అవార్డుల కోసం పోటీ పడే అర్హత ఉంటుంది. కాని తెలుగులో నిర్మాణం జరిగిన 'కేరాఫ్‌ కంచరపాలెం' చిత్రాన్ని మాత్రం జాతీయ అవార్డుల్లో పోటీ పడేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతించలేదు. కారణం ఆ చిత్రాన్ని నిర్మించింది ఒక ఎన్నారై అవ్వడం. ఇండియాకే చెందిన ప్రవీణ పరుచూరి చాలా సంవత్సరాల క్రితం యూఎస్‌ లో సెటిల్‌ అయ్యింది. ఆమె సినిమాలపై అభిరుచితో 'కేరాఫ్‌ కంచరపాలెం' చిత్రంను నిర్మించడంతో పాటు నటించింది.

ఎన్నారై నిర్మించిన సినిమాలను జాతీయ అవార్డుల జాబితాలోకి పరిగణలోకి తీసుకోలేం అంటూ కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ శాఖకు చెందిన అధికారులు గతంలో ప్రవీణ పరుచూరి చేసుకున్న దరకాస్తును తిరష్కరించారు. ఈ విషయాన్ని లైట్‌ తీసుకోకుండా ప్రవీణ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కేటీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్లింది. తెలుగు సినిమాకు జరిగిన అన్యాయంపై కేటీఆర్‌ స్పందించాడు. రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ మరియు అరుణ్‌ జైట్లీలను ట్యాగ్‌ చేసి కేరాఫ్‌ కంచరపాలెంకు మద్దతుగా ట్వీట్‌ చేశాడు.

కేటీఆర్‌ ట్వీట్‌ తో రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ వెంటనే ప్రవీణకు 'కేరాఫ్‌ కంచరపాలెం' చిత్రంకు జాతీయ అవార్డుల పోటీలో నిలిచేందుకు అనుమతిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో జాతీయ అవార్డుల పోటీ కోసం నిర్మాత వెంటనే దరకాస్తు చేసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించినందుకు గాను ఆమె మంత్రి కేటీఆర్‌ గారికి కృతజ్ఞతలు చెప్పారు. జాతీయ అవార్డుల జాబితాలో ఖచ్చితంగా కేరాఫ్‌ కంచరపాలెం ఉటుందని ఆమె నమ్మకంగా చెబుతున్నారు.