మెగా నిర్మాతతో మహేష్ సినిమా

Thu Jun 21 2018 11:05:07 GMT+0530 (IST)

స్టార్ హీరోలతో ఒక సినిమా చేద్దామని బడా నిర్మాతలకు చాలా కోరికగా ఉంటుంది. కాస్త డేట్స్ దొరికే అవకాశం ఉన్నా కూడా అడ్వాన్సులు ఇచ్చేసి హీరోలను ఫిక్స్ చేసుకుంటున్నారు. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కొందరు నిర్మాతలు నష్టాలను చూసి చిన్న తరహా హీరోలతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కెఎస్.రామారావ్ బడా హీరోలతో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. ఇటీవల చిరంజీవి.. తేజ్ ఐ లవ్ యు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చరణ్ తో ఒక ప్రాజెక్టు ఉంటుందని ఆఫర్ ఇచ్చేశారు.ఇక ఇప్పుడు మహేష్ బాబు నుంచి కూడా ఒక మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ అర్జున్ రెడ్డి దర్శకుడితో ఒక ప్రాజెక్ట్ ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు కోసం ఒక నమ్మకమైన సీనియర్ నిర్మాత ఉంటే బావుంటుందని సూపర్ స్టార్ అనుకున్నాడట. అందుకే కెఎస్.రామారావు అయితే బెస్ట్ అని మహేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ నిర్మాత చరణ్ తో సినిమా చేసిన తరువాత మహేష్ తో చేస్తాడని టాక్ వస్తోంది. ప్రస్తుతం మహేష్ దిల్ రాజు ప్రొడక్షన్ లో తన 25వ సినిమాతో బిజీగా ఉన్నాడు..

మరోవైపు దర్శకుడు సందీప్ వంగ అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో మొదలు పెట్టాడు. అందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు అయిపోవడానికి కూడా సమయం పడుతుంది. ఇక మహేష్ 25వ సినిమా అయిపోగానే సుకుమార్ తో అంటున్నారు. ఈ బిజీ షెడ్యూల్ లో కెఎస్.రామారావు కు డేట్స్ ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. మరి ఆ క్రేజీ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.