Begin typing your search above and press return to search.

ఆ క్రికెట‌ర్ కొత్త ఎఫైర్ మొద‌లుపెట్టాడా?

By:  Tupaki Desk   |   19 Aug 2019 6:00 PM GMT
ఆ క్రికెట‌ర్ కొత్త ఎఫైర్ మొద‌లుపెట్టాడా?
X
భార‌త క్రికెట్‌కు సంబంధించి బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీనే టాప్. రోహిత్ కూడా అత‌డికి దీటైన ప్ర‌ద‌ర్శ‌న‌తో సాగిపోతున్నాడు. ఐతే ఇప్పుడు మైదానం బ‌య‌ట ఏదో ఒక వార్త‌తో హైలైట్ అవుతున్న‌ది మాత్రం కేఎల్ రాహులే. హార్దిక్ పాండ్య‌తో క‌లిసి ఓ టీవీ షోలో అమ్మాయిల గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో రాహుల్ ఎంత‌గా మీడియాలో హైలైట్ అయ్యాడో తెలిసిందే. దీనికి తోడు త‌ర‌చుగా అమ్మాయిల‌తో ఎఫైర్లంటూ అత‌ను వార్త‌ల్లో నిలుస్తుండ‌టం విశేషం. ఒక అమ్మాయితో రాహుల్‌కు ఎఫైర్ అంటారు. కొన్ని నెల‌లు గ‌డుస్తాయి. ఇంకో అమ్మాయితో అత‌డి పేరు వినిపిస్తుంది. ఇంకొన్ని నెల‌ల‌కు కొత్త పేరు తెర‌పైకి వ‌స్తుంది. తెలుగు సినిమాల్లో త‌ళుక్కుమంటున్న నిధి అగ‌ర్వాల్‌తో ముందుగా రాహుల్‌కు ఎఫైర్ అన్నారు. ఆ త‌ర్వాత సునీల్ శెట్టి కూతురి అతియా శెట్టితో అత‌డి పేరు ముడిప‌డింది.

తాజాగా రాహుల్ కొత్త‌మ్మాయితో ఎఫైర్ న‌డుపుతున్నాడ‌ని.. ఇది కొంచెం సీరియ‌స్సే అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష సింగ్ రంజ‌న్. ఈ అమ్మాయి సినీ తార కాదు. కానీ సినిమా వాళ్ల‌తో బాగానే సంబంధాలున్నాయి. ఆలియా భట్‌కు మంచి స్నేహితురాలైన ఆకాంక్ష.. అంకిత్ తివారి చేసిన 'తేరే దో నైనా' అని మ్యూజిక్ వీడియోలోనూ కనిపించింది. ఆకాంక్ష‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా.. ట్విట్టర్‌లో ఎనిమిది వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇటీవ‌లే ఆలియా, ఆమె బాయ్ ఫ్రెండ్ ర‌ణ‌బీర్ క‌పూర్‌ల‌కు రాహుల్‌ను ఆకాంక్ష ప‌రిచ‌యం చేస్తున్న ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. రాహుల్ ఒక‌ప్పుడు ప్రేమాయణం న‌డిపిన‌ట్లుగా చెప్పుకున్న ఆతియా.. రాహుల్‌, ఆకాంక్ష‌ల‌తో క‌లిసి ఫొటో దిగ‌డం విశేషం. ఆకాంక్ష‌తో ఎఫైర్ గురించి రాహుల్‌ను అడిగితే.. త‌న గురించి ప‌త్రిక‌ల్లో ఏం రాస్తున్నారో త‌న‌కు తెలియ‌ద‌ని, తాను వ్య‌క్తిగ‌త విష‌యాలు చ‌ర్చించ‌న‌ని.. క్రికెట్ మీదే త‌న దృష్టి అని స‌మాధానం దాట‌వేశాడు.