Begin typing your search above and press return to search.

కిక్-2ను డిజాస్టర్ అంటోంది ఇందుకే

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:12 AM GMT
కిక్-2ను డిజాస్టర్ అంటోంది ఇందుకే
X
తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల దాకా వసూలు చేసిన సినిమా తొలి వారం ముగిసేసరికి ఎంత కలెక్ట్ చేయాలి? పాతిక కోట్లు వచ్చే అవకాశాన్ని కొట్టటిపారేయలేం కదా. కనీసం రూ.20 కోట్ల మార్కయినా దాటుతుందని అనుకుంటాం కదా. కానీ కిక్ సినిమా ఏడు రోజుల్లో రూ.17 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. తొలి వారంలో ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.91 కోట్లు వసూలు చేసింది.

తొలి ఏడు రోజుల్లో కిక్-2 నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.5.6 కోట్లే వసూలు చేసిందది. తొలి రోజు ఊపు చూసి ఇక్కడ వసూళ్లు రూ.7 కోట్లకు పైనే ఉంటాయని అంచనా వేశారు. కానీ సాధ్యం కాలేదు. సీడెడ్ (రాయలసీమ)లో అయితే రూ.2.02 కోట్లే వచ్చాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలిపి కోటి రూపాయలు కూడా రాలేదు. వారంలో అక్కడ రూ.99 లక్షలు వసూలు చేసింది కిక్-2. మిగతా ఆంధ్రా జిల్లాల్లో కలెక్షన్లు బాగున్నాయి. తూర్పుగోదావరిలో రూ.1.36 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.91 లక్షలు, గుంటూరులో రూ.1.03 కోట్లు, కృష్ణాలో రూ.93 లక్షలు, నెల్లూరులో రూ.46 లక్షలు వచ్చాయి. కర్ణాటకలో రూ.2.01 కోట్లు, ఇండియాలోని మిగతా ప్రాంతాల్లో రూ.40 లక్షలు, ఓవర్సీస్ లో రూ.1.2 కోట్లు వసూలు చేసింది కిక్-2.

ఐతే ఫస్ట్ వీకెండ్ తర్వాతి నుంచి కలెక్షన్లు డ్రాప్ అయిన నేపథ్యంలో ఫుల్ రన్ లో రూ.20 కోట్ల మార్కును అందుకుంటే ఎక్కువన్నట్లుంది పరిస్థితి. ఐతే సినిమాపై నిర్మాత కళ్యాణ్ రామ్ దాదాపు రూ.40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ తీసేసినా ఓ పది కోట్ల దాకా నష్టం తప్పేట్లు లేదు. ఈ లెక్కలు చూసే కిక్-2 ఎబో యావరేజ్ టాక్ తో మొదలైనప్పటికీ డిజాస్టర్ కింద లెక్కగడుతున్నారు ట్రేడ్ అనలిస్టులు.