Begin typing your search above and press return to search.

కే.జీ.ఎఫ్‌ కు కైకాల సమర్పకుడు ఎలా?

By:  Tupaki Desk   |   11 Nov 2018 1:30 AM GMT
కే.జీ.ఎఫ్‌ కు కైకాల సమర్పకుడు ఎలా?
X
కన్నడంలో యశ్‌ హీరోగా ‘కే.జీ.ఎఫ్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. చాలా విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంను కన్నడంలోనే కాకుండా తమిళం మరియు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం విడుదల చేస్తున్నది వారాహి చలన చిత్రం బ్యానర్‌ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ చిత్రంను అందిస్తున్న సాయి కొర్రపాటి మరియు విజయ్‌ కిరగందూర్‌ లతో పాటు కైకాల సత్యనారాయణ సమర్పించు అంటూ టైటిల్‌ కార్డ్‌ వేశారు.

తెలుగులో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ ల కాంలో ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన కైకాల సత్య నారాయణ 90ల్లో కూడా మంచి సినిమాల్లో, మంచి పాత్రల్లో నటించాడు. అయితే దాదాపు దశాబ్దంనర కాలంగా కైకాల కనిపించడం లేదు. ఆయన సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. ఆమద్య ఒక ఇంటర్వ్యూలో బాహుబలి సినిమాపై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు వీడియోల్లో, ఏదైనా ఒకటి రెండు కార్యక్రమాల్లో కనిపించాడు. కాని తాజాగా ‘కే.జీ.ఎఫ్‌’ చిత్రం సమర్పకుడిగా కైకాల పేరు కనిపించడం ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో చర్చ నీయాంశం అయ్యింది.

కన్నడంలో రూపొందిన చిత్రం, తెలుగులో సాయి కొర్రపాటి - విజయ్‌ కిరగందూర్‌ లు అందిస్తున్నారు. మరి కైకాల సమర్పకుడిగా ఎందుకు పేరు వేస్తున్నారు అనేది ఏ ఒక్కరికి అర్థం కాసి విషయం. కైకాల సత్యనారాయణకు సినిమాకు సంబంధం ఏంటీ అనేది సినిమా విడుదల సమయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మళ్లీ కైకాల పేరు స్క్రీన్‌ పై రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిన్న విడుదలైన కే.జీ.ఎఫ్‌ చిత్ర ట్రైలర్‌ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.