టాలీవుడ్ స్టార్స్ ను టెన్షన్ పెడుతున్నాడు

Thu Nov 15 2018 21:00:01 GMT+0530 (IST)

డిసెంబర్ లో పలు తెలుగు చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. యువ హీరోలు వరుణ్ తేజ్ శర్వానంద్ బెల్లంకొండ శ్రీనివాస్ నిఖిల్ లు డిసెంబర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు బ్యాక్ టు బ్యాక్ వచ్చేందుకు సిద్దం అయ్యారు. అయితే వీరంతా కూడా ప్రస్తుతం ఒక కన్నడ హీరోను చూసి తెగ టెన్షన్ పడుతున్నట్లుగా అనిపిస్తోంది. కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కెజిఎఫ్’ చిత్రం డిసెంబర్ లో విడుదలకు సిద్దం అవుతుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సినీ వర్గాల వారు అంటున్నారు.‘కెజిఎఫ్’ డిసెంబర్ లో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమాతో పాటు వచ్చే హీరోకు పెద్ద నష్టం తప్పదు. ఇక ఆ సినిమా విజయాన్ని దక్కించుకుంటే రెండు మూడు వారాల వరకు ఇతర సినిమాల జోలికి ప్రేక్షకు వెళ్లే అవకాశం లేదని దాంతో డిసెంబర్ లో సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న యువ హీరోలు టెన్షన్ కు గురి అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ యువ హీరోలు తమకున్న పరిచయాల ద్వారా ‘కెజిఎఫ్’ ను వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే కన్నడం తెలుగు హిందీల్లో విడుదలకు ఒకే సారి ప్లాన్ చేస్తున్న కారణంగా వాయిదా అనేది కష్టం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ - శర్వానంద్ - బెల్లంకొండ మూవీలు ‘కెజిఎఫ్’ మూవీ వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ హీరోలు ఏం చేస్తారో చూడాలి.

TAGS: KGF Movie