రాకింగ్ స్టార్ బాక్స్ ఆఫీస్ రచ్చ కంటిన్యూ..

Tue Jan 01 2019 15:39:02 GMT+0530 (IST)

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా 'కేజీఎఫ్' తెలుగు తో పాటుగా ఇతర భాషలలో కూడా డిసెంబర్ 21 రిలీజ్ అయింది.  ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్'ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను కంటిన్యూ చేస్తోంది.  తెలుగు వెర్షన్ ఇంకా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండడం విశేషం.'కేజీఎఫ్' తో పాటుగా 'పడి పడి లేచే మనసు'.. 'అంతరిక్షం' లాంటి సినిమాలు రిలీజ్ అయినా అవేవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.  మరోవైపు డిసెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన 'బ్లఫ్ మాస్టర్'.. 'ఇదం జగత్' కూడా 'కేజీఎఫ్' కు పోటీ ఇవ్వలేక పోవడంతో ఇప్పుడు ఆడియన్స్ కు యాష్ సినిమానే ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ.7.5 కోట్ల షేర్ వసూలు చేసిన కేజీఫ్ 10 కోట్ల షేర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.  దాదాపు సంక్రాంతి వరకూ కొత్త సినిమాలు లేకపోవడంతో 'కేజీఎఫ్' సోలోగా గానే బాక్స్ ఆఫీస్ ను దున్నుకుంటోంది.  

అసలు ఒక కన్నడ డబ్బింగ్ సినిమా ఇలా తెలుగులో హిట్ కావడమే రేర్ గా జరుగుతుంది. పైగా ఈ రేంజ్ కలెక్షన్స్ ఎప్పుడూ ఒక కన్నడ డబ్బింగ్ సినిమాకు రాలేదు.  రూ.10 కోట్ల మార్కు టచ్ చేస్తే 'కేజీఎఫ్' ఫ్యూచర్ లో రాబోయే కన్నడ  సినిమాలు ఒక భారీ బెంచ్ మార్క్ సెట్ చేసినట్టే.  తెలుగులో ఈ సినిమాను విడుదల చేసిన సాయి కొర్రపాటికి ఈ సినిమాతో బాగానే గిట్టుబాటు అయిందని సమాచారం.