Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ‘బాహుబలి’ స్పూఫ్‌ వీడియో వైరల్‌

By:  Tupaki Desk   |   12 Dec 2018 12:52 PM GMT
కేసీఆర్‌ ‘బాహుబలి’ స్పూఫ్‌ వీడియో వైరల్‌
X
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేసీఆర్‌ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సమయంలోనే మీడియాలో రకరకాలుగా స్పూఫ్స్‌ వస్తున్నాయి. అందరి దృష్టిని అధికంగా ఆకర్షించినది కేసీఆర్‌ 2.ఓ. పలు ఛానెల్స్‌ మరియు సోషల్‌ మీడియాలో ఫలితాలు తేలగానే కేసీఆర్‌ 2.ఓ అంటూ తెగ హడావుడి చేశారు. ఇక ప్రజా కూటమి వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్లుగా ఎన్నో ఫన్నీ వీడియోలు, స్పూఫ్స్‌, మీమ్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ ప్రజా కూటమి ఉన్న సమయంలో కూడా పెద్ద ఎత్తున మీమ్స్‌, స్పూప్స్‌ లు వచ్చాయి. అందులో భాగంగానే బాహుబలి స్పూప్‌ వీడియోను తయారు చేశారు. బాహుబలి మొదటి పార్ట్‌ లోని బాహుబలి, కాలకేయుల మద్య యుద్దం జరిగేందుకు ముందు సన్నివేశాన్ని ఎన్నికల సందర్బంగా స్పూప్‌ చేశారు. బాహుబలి పాత్రలో కేసీఆర్‌ ను శివగామి పాత్రలో తెలంగాణ తల్లిని, ఇక కాలకేయుడి పాత్రలో చంద్రబాబు నాయుడును చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో మంచి ఎడిటింగ్‌ తో పాటు మంచి డైలాగ్స్‌ తో కొనసాగింది. దాంతో వీడియోను చూడటం మొదలు పెట్టిన వ్యూవర్స్‌ ఆ వీడియో మొత్తం అయ్యే వరకు చూస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున షేర్‌ అవుతున్న ఈ వీడియో టీఆర్‌ఎస్‌ అభిమానులను తెగ అలరిస్తోంది.

Watch Here : https://www.youtube.com/watch?v=Gk64z3L36xA