Begin typing your search above and press return to search.

సూర్య కోసం దోశ వేస్తే.. చపాతిలా..

By:  Tupaki Desk   |   24 April 2017 6:43 PM GMT
సూర్య కోసం దోశ వేస్తే.. చపాతిలా..
X
సూర్య అండ్ జ్యోతిక.. తమిళ్ సినిమా బెస్ట్ జోడీ ఆన్ స్క్రీన్ లో అండ్ ఆఫ్ స్క్రీన్ లో కూడా!! ఇప్పుడు జ్యోతిక నటిస్తున్న ‘మగాలిర్‌ మట్టం’ అనే చిత్రా ప్రమోషన్ లో బాగా బిజీ గా ఉన్నారు. సూర్య ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక.. మళ్ళీ 36 అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఒక మోస్తరుగా మెప్పు పొందింది. ఇప్పుడు మగాలిర్‌ మట్టం అనే సినిమా తో మళ్ళీ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో శరణ్య, ఊర్వశి, భానుప్రియ కీలక పాత్రల్లో జ్యోతిక తో కలిసి నటిస్తున్నారు. దీన్ని బట్టి ఇది ఉమెన్ సెంట్రీ గా ఉన్న కథ అన్నీ అనుకోవచ్చు. ఈ సినిమా సంగీతం విడుదల సందర్భంగా.. జ్యోతిక కొన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ''సూర్య నా జీవితం లోకి రావడం నా అదృష్టం. సూర్యకి నాకు పెండ్లి అయ్ పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో తన కోసం నేను కేవలం ఒక్క దోశ వేశాను అంతే. అది కూడా చపాతీ లా వచ్చింది. ఆ దోశ తిన్నందుకు ఇప్పుడు ధన్యవాదాలు సూర్య'' అని మురిపంగా చెప్పింది. ''తర్వాత దోశలు పోసే అవకాశం అమ్మ ఇవ్వలేదు. నా చేత్తో ఒక కాఫీ ఆయన చేసి ఇస్తే బాగుంటుంది అని ఇస్తే ఆ కాఫి తాగకుండా సూర్య అక్కడి నుంచి పారిపోతాడు. అది భరించలేకే నన్ను మళ్ళీ సినిమాలు చేయమని చెప్పుతున్నాడు'' అనుకుంటా అని కొంటెగా అన్నది.

మొత్తానికి సూర్య తన భార్యను ఇప్పుడు హీరో చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈ ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు గట్రా. మరి జ్యోతిక ఈసారి కాస్త గాట్టిగా బ్లాక్ బస్టర్ కొట్టేసి ఏమన్నా నిలబెట్టుకుంటుందేమో చూడాలి.