Begin typing your search above and press return to search.

ఖుషి సీక్వెల్ కి రెడీ అంటున్న హీరొయిన్

By:  Tupaki Desk   |   17 Nov 2018 5:30 PM GMT
ఖుషి సీక్వెల్ కి రెడీ అంటున్న హీరొయిన్
X
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేని మూవీ ఖుషి. అప్పటిదాకా మాస్ సినిమాల పేరుతో ఉన్న రికార్డులను ఒక సెన్సిటివ్ లవ్ స్టొరీతో బద్దలు కొట్టడం చూసి ట్రేడ్ పండితులు సైతం నివ్వేరబోయారు. మైల్ స్టోన్ గా నిలిచిన ఖుషిలో నటించిన వాళ్ళతో పాటు అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి పెద్ద బ్రేక్ లా నిలిచింది. ఇది తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ లో విజయ్-జ్యోతిక జంట చేసిన అల్లరికి కోలీవుడ్ ధియేటర్లు మార్మ్రోగిపోయాయి.

ఇన్నాళ్ళకు మళ్ళి ఖుషి ప్రస్తావన వచ్చింది. జ్యోతిక నటించిన కొత్త సినిమా కాత్రిన్ మోజీ మంచి స్పందనతో పాటు వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. హింది హిట్ తుమరి సులు కు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో మంచు లక్ష్మి కూడా ఒక కీలక పాత్ర చేసింది. దాని ప్రమోషన్ లో భాగంగా ఖుషి సీక్వెల్ గురించి ప్రస్తావించగా మంచి కథతో తనకు నప్పే పాత్రతో వస్తే చేయడానికి అభ్యంతరం లేదంటున్న జ్యోతిక పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఇచ్చే దేన్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది.

అయితే ఖుషి సీక్వెల్ కనక నిజంగా కార్య రూపం దాల్చితే అభిమానులకు అంత కన్నా కావాల్సింది ఏముంది. విజయ్ ఇంకా ఫాం లో ఉన్నాడు కాని జ్యోతిక ఈ పాటికే హీరొయిన్ ఓరియెంటెడ్ పాత్రల వైపు వచ్చేసింది. సో ఖుషి రీమేక్ జరిగినా జ్యోతిక స్థానంలో ఇంకో హీరొయిన్ రావాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో లేడు కాబట్టి రామ్ చరణ్ లేదా వరుణ్ తేజ్ చేస్తే బెటరేమో. సీక్వెల్స్ ఏ మాత్రం అచ్చిబాటు రాని ట్రెండ్ లో ఖుషి సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్ళడం అసాధ్యం కాదు కాని దర్శకుడిగా నటుడిగా ఎక్కువగా బిజీగా ఉన్న ఎస్ జే సూర్యను ఓ మాట అడిగితే బెటరేమో