Begin typing your search above and press return to search.

ఆ రోజు నలుగురికి బ్రేక్ కావాలి.. రావాలి..

By:  Tupaki Desk   |   26 Aug 2016 4:09 AM GMT
ఆ రోజు నలుగురికి బ్రేక్ కావాలి.. రావాలి..
X
సెప్టెంబర్ 9న ఏయే సినిమాలు రిలీజవుతాయో ఇంకా ఫిక్సవ్వలేదు. మొన్నటివరకు ఈడు గోల్డ్ ఏహా.. ప్రేమమ్.. ఇంకొక్కడు సినిమాలు రిలీజవుతాయి అనుకున్నారు కాని.. వారిలో కొందరు వెనక్కెళితే కొందరు సైలెంట్ అయ్యారు. అయితే అనూహ్యంగా ''జ్యో అచ్యుతానంద'' సినిమా మాత్రం ఆ రోజు వచ్చేస్తున్నట్లు డేట్ ప్రకటించేశారు. ఎలాగో 'జనతా గ్యారేజ్‌' 1న రిలీజవుతోంది కాబట్టి.. 9న వచ్చే ఈ సినిమాకు ధియేటర్ల కొరత ఉండదులే. కాకపోతే ఈ సినిమా హిట్టవ్వడం చాలా ముఖ్యం.

ఈ మధ్య కాలంలో ఆయన స్వయంగా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్టవ్వలేదు. అందుకే ఈ జ్యో అచ్యుతానంద సినిమా హిట్టవ్వడం సాయి కొర్రపాటికి ఎంతో అవసరం. అదే విధంగా ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా డస్కీ బ్యూటి రెజీనా సూపర్ స్టార్లెట్ స్టాటస్ మాత్రం రావట్లేదు. ఒక్కటైనా సరైన హిట్టు పడితేనే ఆ రేంజ్ వచ్చేది. అందుకే ఈ సినిమా ఆడటం రెజీనాకు చాలా ముఖ్యం. కొత్తల్లో డిఫరెంట్ స్టోరీలతో అలరించిన నారా రోహిత్ ఇప్పుడు మాత్రం వరుసగా కమర్షియల్‌ సినిమాలతో ఈ ఏడాది మూడుసార్లు దెబ్బతిన్నాడు. అందుకే ఈ రొమాంటిక్ ఎంటర్టయినర్ తో తన క్రేజ్ ను డబుల్ చేసుకోవాలి. ఇక శ్రీనివాస్ అవసరాల ఇచ్చిన ఊహలు గుసగుసలాడే బ్రేక్ ను సరిగ్గా వాడుకోలేక చతికిలపడుతున్నాడు నాగ శౌర్య. అందుఏ మనోడికి కూడా ఈ సినిమా హిట్టవ్వడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా సెప్టెంబర్ 9న ఈ నలుగురికీ బ్రేక్ కావాల్సిందే. ఇప్పటికే టీజర్లతో బాగా ఆకట్టుకోవడం.. సినిమా మ్యూజిక్ కూడా వినసొంపుగా ఆహ్లాదకరంగా ఉండటంతో ఖచ్చితంగా హిట్టు రావల్సిందే అంటున్నారు అభిమానులు. వెయిట్ అండ్ సీ.