Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 3 వార్తలను కొట్టి పారేసింది

By:  Tupaki Desk   |   26 May 2019 10:42 AM GMT
బిగ్‌ బాస్‌ 3 వార్తలను కొట్టి పారేసింది
X
ఒక వైపు తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే నెలలో షో కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ బిగ్‌ బాస్‌ తోనే తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 కూడా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా హోస్ట్‌ ఎంపిక మరియు పార్టిసిపెంట్స్‌ ఎంపిక విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆలస్యం అవుతోంది. మరి కొన్ని రోజుల్లోనే తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని.. పార్టిసిపెంట్స్‌ కూడా ఫైనల్‌ అయ్యారంటూ కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలా బిగ్‌ బాస్‌ లో పార్టిసిపేట్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 కోసం శ్రీముఖి, ఉదయభాను, గుత్తా జ్వాలా, వరుణ్‌ సందేశ్‌, వైవా హర్ష ఇంకా జబర్దస్త్‌ నుండి ఒక కమెడియన్‌ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తన పేరు ఈ వార్తల్లో వస్తున్న నేపథ్యంలో గుత్తా జ్వాలా సోషల్‌ మీడియాలో స్పందించింది. తాను బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి పారేసింది. ఇదే సమయంలో ఈ విషయంకు సంబంధించిన మరో పుకారు కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 కోసం ఆమెను సంప్రదించిన మాట వాస్తవమే కాని.. ఆమె పారితోషికం మరీ టూమచ్‌ గా డిమాండ్‌ చేసిందని.. ఆ కారణంగానే ఆమె స్థానంలో మరెవ్వరినైనా తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాను డిమాండ్‌ చేసిన పారితోషికంకు వారు ఓకే చెప్పిన కారణంగా ఇన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను ఇప్పుడు గుత్తా జ్వాలా ఖండించిందనిపిస్తుంది. బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌ కు వారి స్టార్‌ స్టేటస్‌ ను బట్టి రోజు వారి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. గుత్తా జ్వాలాను వద్దనుకున్నారంటే ఆమె ఏ స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేసిందో మరి..!