Begin typing your search above and press return to search.

పబ్లిక్ సెక్స్ తో దొరికిపోయిన పాప్ సింగర్!

By:  Tupaki Desk   |   29 Aug 2016 9:46 AM GMT
పబ్లిక్ సెక్స్ తో దొరికిపోయిన పాప్ సింగర్!
X
పాశ్చాత్య పాప్ సంగీత ప్రపంచంలో చిన్న వయసులోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ జస్టిన్ బీబర్. ఈ సింగర్ పాప్ ఆల్బమ్స్ తో వార్తల్లోకి ఎక్కాల్సిందిపోయి.. ఈమధ్య తరుచూ వివాదాలతోనే వార్తల్లోకి ఎక్కుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బ్రోతల్ హౌజ్ లో పట్టుబడిన ఈ పాప్ స్టార్.. మాజీ గర్ల్ ఫ్రెండ్ సెలెనాతో డేటింగ్ సందర్బంలోను ఒకసారి అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఓ వ్యాన్ డ్రైవర్ ను కొట్టి మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. ఈస్థాయి గ్రాఫ్ మెయింటెన్ చేస్తున్న జస్టిన్ బీబర్... తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ సోఫియాతో పబ్లిక్ సెక్స్ చేసి వివాదాస్పదమయ్యాడు.

తన శృంగార లీలలతో ఇప్పటికే బ్యాడ్ బోయ్ ముద్రేసుకున్న జస్టిన్ బీబర్.. తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ సోఫియాతో బహిరంగ శృంగారంలో పాల్గొనడం వివాదస్పదంగా మారింది. జస్టిన్ బీబర్ తన గర్ల్ ఫ్రెండ్ సోఫియాతో జరిగిపిన శృంగార లీలలకు సంబందించిన చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో బీబర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగ్నంగా సెక్స్ లో పాల్గొన్నట్లున్న సోఫియా - బీబర్ ల ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా గతంలో సోఫియాతో బీబర్ చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాస్తంత అలక బుచ్చుకున్నాడు. తన స్నేహితురాలిపై అభిమానులు ఇలాగే కామెంట్స్ చేస్తే ఫ్యాన్స్ కోసం వీడియోలు, ఫొటోలు ఏవీ అందుబాటులో ఉంచనని, వాటిని ప్రైవేట్ గా మార్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సోఫియాతో ఏకంగా శృంగారంలో పాల్గొన్న ఫోటోలే బయటకు రావడంతో కామెంట్స్ పెరిగిపోతున్నాయి.