Begin typing your search above and press return to search.

బీబర్ ఈవెంట్ బాగా శృతి తప్పింది

By:  Tupaki Desk   |   24 May 2017 5:47 AM GMT
బీబర్ ఈవెంట్ బాగా శృతి తప్పింది
X
కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ మ్యూజిక్ లైవ్ షో ఇండియాలో గత కొన్ని వారాల కిందట జరిగిన సంగతి తెలిసిందే. ఆ పోగ్రామ్లో జరిగిన అవకతవకలు సమసిపోయాయి అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ముంబాయి లో జరిగిన ఈ షో ఒక వరద బురదే మిగిల్చి పోయింది.

ఆ షో నిర్వహించిన అర్జున్ జైన్ కు.. థానె ఎంటర్టైన్మెంట్ బ్రాంచ్ శాఖ తరుపున ఒక నోటిస్ పంపించారు. వైట్ ఫాక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ షో తెరవెనుక బాగోతలు చాలా జరిపిందట. అక్కడ అనుమతి ఇచ్చిన స్థలంలో 3,529 ప్రేక్షకులు పడతారు కానీ అక్కడుకు వచ్చినవాళ్లు 7,000 పైగా ఉన్నారట. వి‌వి‌ఐ‌పి లో ఉన్న రెండు సెక్షన్లలో 93, 86 మంది ఉండాలి కానీ షో జరిగినప్పుడు ఒక్కో సెక్షన్లో 150 కి పైగా కనిపించారు. వైట్ ఫాక్స్ వాళ్ళు చెప్పిన వివరాలు వాళ్ళు చేసిన పనులు పూర్తిగా రూల్స్ కు విరుద్దంగా ఉన్నాయి. దీనికి వాళ్ళు సుమారుగా 1.85 కోట్లు పెనాల్టీ పే చేయవలిసి ఉందట. అక్కడ ఈవెంట్ కు పని చేసిన వాళ్ళుకు కూడా పూర్తి పేమెంట్ ఇవ్వలేదట ఆర్గనైజ్ చేసినవాళ్లు. అందుకే ఇప్పుడు వీరికి ఎంటర్టయిన్మెంట్ బ్రాంచ్ పెనాల్టీ కట్టడానికి 7 రోజుల గడువు ఇచ్చింది. అది సంగతి.

ఇంకోటి కూడా ఉందండోయ్.. అక్కడకు వచ్చిన అభిమానులు ఒక విషయంలో బాగా నిరాశ చెందారు. బీబర్ పాడిన పాటకు వాళ్ళ పెదాల కదిలికకు ఏమి పొంతన లేదంటూ అందరూ ఎద్దేవా చేశారు. ఇంత దారుణంగా నిర్వహించిన ఈ షో కి టికెట్లు రేటు మాత్రం 4,000 నుండి 70,000 వరుకు వసూలు చేశారు. ప్చ్!!