'కచ్ఛితంగా..ఆ నటులకు ఎయిడ్స్ ఉంటుంది'

Mon Apr 16 2018 13:01:56 GMT+0530 (IST)

సంచలన వ్యాఖ్యలకు వేదికైంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. తెలుగు సినీ రంగంలో లైంగిక ఆర్థిక దోపిడీలపై మహిళా సంఘాల అధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. జూనియర్ ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. వీరికి అండగా పలు మహిళా సంఘాలు వారు తమ వాదనను వినిపించారు.ఈ సందర్భంగా ఒక జూరియర్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు పెను సంచలనానికి కారణమైంది. తన కుటుంబం ఉన్న పరిస్థితుల దృష్ట్యా..2013లో తాను అమీర్ పేటలో ఉన్న 24 ఫ్రేమ్స్ సంస్థలో యాక్టింగ్ కోర్సు చేసినట్లుగా చెప్పింది. రూ.30వేలు కట్టి.. ఏడాది తర్వాత పెద్ద పెద్ద సినిమా సంస్థలకు పరిచయం చేస్తారనుకుంటే కృష్ణనగర్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెన్సీల వారికి పరిచయం చేశారన్నారు. ఎక్కడో సీరియల్స్ లో వెనుక పక్క ఉన్న క్యారెక్టర్లు ఇచ్చారన్నారు. ఏడాది పాటు తానెంతో స్ట్రగుల్ అయ్యానని చెప్పిన ఆమె.. తనకు చాన్సులు ఇవ్వకపోతే తాను చచ్చిపోవటం ఖాయమని హెచ్చరించింది.

తన ప్రోగ్రామ్ ను తన తల్లిదండ్రులు ఇప్పుడు టీవీల్లో చూస్తుంటారని.. వారేం చెప్పినా తాను పట్టించుకోనని.. తనకు చాన్స్ లు ఇవ్వకుంటే చనిపోవటం ఖాయమంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారు వారింబోగా.. అక్కా.. నువ్వు ఇంతకాలం పోరాడావు.. ఎవరైనా ఛాన్సులు ఇస్తామని చెప్పారా?  వీళ్లు మారరు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురి మీద తీవ్ర ఆరోపణలు చేశారు.

టీవీల్లో బతుకు జట్కా బండి అంటూ షోలో కూర్చొని నీతులు చెప్పే జీవిత.. బయట చేసేది మాత్రం బ్రోకర్ పనులని.. అదేంటో తనకు అర్థం కావట్లేదన్నారు. ఇండస్ట్రీలో చాలామంది ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారని.. వాళ్ల పెళ్లాలు.. ఇంట్లో వాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి ఒక్కళ్లకు ఎయిడ్స్ ఉంటుందన్నది తన నమ్మకంగా చెప్పారు. కచ్ఛితంగా ఎయిడ్స్ ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించి.. చికిత్స చేయించాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

తమకు సాయం చేయాలని.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి పోవాలని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదని.. జూనియర్ ఆర్టిస్ట్ లను అమ్మాయిలుగా చూడట్లేదన్న ఆవేదన వ్యక్తం చేసింది. క్యారవాన్ లో ఉండే వారికి.. తమకు భారీ వ్యత్యాసం చూపిస్తారని.. క్యారవాన్ లో ఉండే వారు.. తాము ఒకటే నీళ్లు.. ఒకటే ఫుడ్డు తింటామన్నారు.

అబ్బాయిలు రూ.50వేలు ఇచ్చి క్యారెక్టర్ కావాలంటే ఇస్తుంటారని.. కానీ.. తాము మాత్రం డబ్బులు ఇచ్చి క్యారెక్టర్ ఇవ్వమంటే ఇవ్వరంటూ.. "నువ్వు డబ్బులు ఇవ్వటం ఎందుకు?.. పడుకో అంటారు. ఏం .. అమ్మాయిలు డబ్బులు కట్టుకోలేరా? " అని ప్రశ్నించింది. ఇప్పుడీ జూనియర్ ఆర్టిస్ట్ లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యూ ట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి