టాలీవుడ్.. ముగ్గురు ఉత్తమ పురుషులు

Mon Apr 16 2018 14:21:01 GMT+0530 (IST)

తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం.. ఆమె ఈ వ్యవహారంపై ఒక ఉద్యమాన్నే మొదలుపెట్టడంతో మరింత మంది చిన్న స్థాయి ఆర్టిస్టులు మీడియా ముందుకొస్తున్నారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పదుల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు హాజరై  సినీ పరిశ్రమలో అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలపై మహిళా సంఘాల నేతలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో కొందరు అమ్మాయిలు చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. పెద్ద పెద్ద హీరోలు.. సెలబ్రెటీల గురించి ఏ భయం లేకుండా బోల్డ్ కామెంట్లు చేశారు అందులో కొందరు. పవన్ కళ్యాణ్ బెంగాలీ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడని ఒకమ్మాయి ఆరోపించిన సంగతి తెలిసిందే.మరో అమ్మాయి పవన్ తో పాటు మరి ఇద్దరిని కూడా కలిపి ఉతికారేసింది. ఇండస్ట్రీలో ముగ్గురు ఉత్తమ పురుషులున్నారంటూ ఆ ముగ్గురి గురించి ఆమె చేసిన ప్రసంగం హాట్ టాపిక్ అయింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన ముగ్గురు పురుషులు.. పవన్ కళ్యాణ్.. శేఖర్ కమ్ముల.. కత్తి మహేష్. ముందుగా పవన్ ప్రస్తావన తెచ్చిన ఆమె.. మొన్న మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మాయిపై ఏదైనా అఘాయిత్యం చేస్తే వెంటనే తాను ఆ వ్యక్తిని కొట్టేస్తానని పవన్ చెప్పాడని.. ‘తమ్ముడు’ షూటింగ్ సందర్భంగా కూడా అమ్మాయిల్ని వేధించిన వాళ్లను కొట్టానని పవన్ అన్నాడని.. ఐతే తాను వ్యక్తిగతంగా ఏదైనా అన్యాయం చూస్తే చేయి చేసుకుంటానని చెప్పే పవన్.. కొన్ని నిమిషాలకే శ్రీరెడ్డి గురించి స్పందిస్తూ ఆమె మాత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని అన్నాడని.. ఇంతలో ఎంత మాట మార్చేశాడని అంది. బయటి అమ్మాయిలే అమ్మాయిలా.. ఇండస్ట్రీలోని వాళ్లు అమ్మాయిలు కాదా అని ఆమె ప్రశ్నించింది. బయటి అన్యాయాల గురించి అలా మాట్లాడుతున్న పవన్ తన ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి మాత్రం స్పందించడని.. అతడి చుట్టూ ఉన్నవాళ్లే అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తుంటారని ఆమె ఆరోపించింది. ఇక శేఖర్ కమ్ముల.. కత్తి మహేష్ లు తమపై ఆరోపణలు చేసిన వాళ్లను లీగల్ యాక్షన్ పేరుతో బెదిరిస్తున్నారని.. తమ వాదన కూడా వినిపించకుండా వెంటనే లీగల్ యాక్షన్ అనడం ద్వారా అమ్మాయిల నోరు మూయించడానికి ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది. ప్రతిదానికీ ప్రూఫ్స్ అడుగుతున్నారని.. ప్రూఫులు ఎక్కడ ఉంటాయని.. ప్రూఫులు లేకుంటే మాట్లాడకూడదా అని ఆమె ప్రశ్నించింది.

వీడియో కోసం క్లిక్ చేయండి