ఈ ఏడాది ప్రపంచ అందగత్తె ఎవరంటే..

Fri Apr 21 2017 13:46:44 GMT+0530 (IST)

అందాలు చిందించే.. వయ్యారాలు కుమ్మరించే.. సొగసులు కుమ్మరించే అందగత్తెలు ప్రతీ దేశంలోనూ ఉంటారు. మరి ప్రపంచాన్ని మైమరిపించే అందగత్తె ఎవరంటే మాత్రం చెప్పడం కాసింత కష్టమైన విషయమే. అందుకే పలు సంస్థలు ఆ బాధ్యత జనాల నెత్తినే పెట్టేస్తుంటాయి.

అభిమాన వ్యక్తుల్లో అత్యంత అందమైన సొగసరిని ఎంపిక చేసేయమని పోలింగ్ లు.. ఓటింగ్ లు పెట్టేస్తుంటాయి. పీపుల్స్ మేగజైన్ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ సారి కూడా వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ కోసం వోటింగ్ జరపగా.. 2017 సంవత్సరానికి ఈ కిరీటం హాలీవుడ్ అందగత్తె జూలియా రాబర్ట్స్ కు ఈ పురస్కారం దక్కింది. ఓటింగ్ లో పాల్గొన్నవారిలో అత్యధిక శాతం జూలియాకే కిరీటం కట్టబెట్టేశారు. ఈ 49 ఏళ్ల అమెరికన్ అందగత్తెను మించిన అందం.. ప్రపంచంలో లేదని తేల్చి పారేశారు. ఇలా ఈ ఘనతను సాధించడం ఐదోసారి కావడమే అసలైన విషయం.

30 ఏళ్లుగా హాలీవుడ్ లో కొనసాగుతూ.. ఇంకా తన స్థాయినే కాదు.. అందాన్ని కూడా ఏమాత్రం తగ్గకుండా.. ఏటికేడాది ఇనుమడింప చేసుకుంటున్న జూలియా రాబర్ట్స్ కు.. ఇంకొన్నేళ్ల పాటు సౌందర్య సామ్రాజ్యాన్ని ఏలేయచ్చంటున్నారు జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/