Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సింగింగ్ సెన్సేష‌న్‌

By:  Tupaki Desk   |   28 July 2016 9:24 AM GMT
ఎన్టీఆర్ సింగింగ్ సెన్సేష‌న్‌
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ లో బోలెడ‌న్ని క‌ళ‌లున్నాయి. ఆయ‌న ఎంత మంచి న‌టుడో - అంత మంచి డ్యాన్స‌ర్ కూడా. ఎంత బాగా డ్యాన్స్ వేస్తాడో అంత బాగా పాడ‌తాడు కూడా. అందుకే ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌ తో పాట పాడించడానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కీర‌వాణి - దేవిశ్రీప్ర‌సాద్‌ - త‌మ‌న్ త‌దిత‌ర సంగీత ద‌ర్శ‌కులంతా ఎన్టీఆర్‌ తో పాట పాడించి సంతోషించిన‌వాళ్లే. ఆయ‌న గాన క‌ళ ఈమ‌ధ్య పొరుగు భాష‌ల‌కీ ప‌రిచ‌య‌మ‌వుతోంది. ఇటీవ‌లే క‌న్న‌డ సూప‌ర్‌ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ న‌టించిన ఓ చిత్రం కోసం గెలయా గెల‌యా అనే పాట పాడి అద‌ర‌గొట్టాడు.ఆ పాట క‌న్న‌డ‌లో సూప‌ర్‌హిట్ట‌య్యింది.

అలాగే నాన్న‌కు ప్రేమ‌తోలో కూడా ఇటీవ‌ల ఫాలో ఫాలో ఫాలో యు అంటూ పాట పాడి అభిమానుల్ని అల‌రించిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ పాడిన ఈ రెండు పాట‌ల‌కీ అవార్డులొచ్చాయి. ఆయ‌న్ని సింగింగ్ సెన్సేష‌న్‌ గా మార్చాయి. ప్ర‌తి యేటా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ జ‌ర‌గుతుంటాయి. ఈ యేడాది కూడా సౌత్ ప‌రిధిలో నిన్న‌నే మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ జ‌రిగాయి. అందులో పాట‌లు పాడిన స్టార్స్‌ కి `స్టార్ యాజ్ ఎ సింగింగ్ సెన్సేష‌న్` పేరుతో పుర‌స్కారాన్ని అంద‌జేస్తుంటారు. దానికింద ఎన్టీఆర్‌ కి రెండు పురస్కారాలొచ్చాయి. యంగ్ టైగ‌ర్ మ‌రిన్ని పాట‌లు పాడి అద‌ర‌గొట్ట‌డానికి ఇంత‌కంటే గొప్ప ప్రోత్సాహం మ‌రేముంటుంది?!