Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్.. కింగ్ ఆఫ్ బాక్సాఫీస్

By:  Tupaki Desk   |   25 March 2017 6:42 AM GMT
జూనియర్ ఎన్టీఆర్.. కింగ్ ఆఫ్ బాక్సాఫీస్
X
ఉత్తమ నటుడిగా ఇప్పటిదాకా చాలా అవార్డులే అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఐతే తొలిసారిగా అతను ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’ అనే కొత్త పురస్కారాన్ని తీసుకున్నాడు. ‘జీ’ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డుల వేడుకలో 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ రూ.55 కోట్ల దాకా షేర్ సాధిస్తే.. ‘జనతా గ్యారేజ్’ రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్-3 హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు ఈ అవార్డు అందజేశారు.

ఇంతకుముందు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి పేరుండేది కానీ... బాక్సాఫీస్ రేసులో మాత్రం బాగా వెనుకబడి ఉండేవాడు. ఐతే ‘టెంపర్’ దగ్గర్నుంచి సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుని ‘జనతా గ్యారేజ్’తో అనూహ్యమైన స్థాయిని అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అభిమానులు.. దర్శకుల వల్లే తాను ఇప్పుడీ స్థాయిలో ఉన్నానన్నాడు. ఇక ముందూ మంచి స్క్రిప్టులు ఎంచుకుని సాగిపోతానని అన్నాడు.

మరోవైపు సమంత ‘క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ అవార్డును అందుకోవడం విశేషం. ఆమె గత ఏడాది ‘అఆ’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించింది. ఎన్టీఆర్.. సమంతల అవార్డుల్లో వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాకు భాగస్వామ్యం ఉండటం విశేషమే. తమిళ స్టార్ హీరో సూర్య ‘సెన్సేషన్ ఆఫ్ సౌత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. జీ టీవీ వాళ్లు ఒకేసారి బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/