Begin typing your search above and press return to search.

మహానటికి ఎన్టీఆర్ ఓకే అన్నాడా?

By:  Tupaki Desk   |   22 Jun 2017 5:25 AM GMT
మహానటికి ఎన్టీఆర్ ఓకే అన్నాడా?
X
అలనాటి మేటి తార సావిత్రి జీవితంపై రూపొందుతున్న సినిమా 'మహానటి'. సౌతిండియాలో అత్యంత క్రేజ్ సృష్టిస్తున్న ఈ చిత్రంపై.. చాలానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ స్థాయిని మరింతగా పెంచేందుకు మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని అశ్వినీ దత్ కూతురు ప్రియాంక దత్ నిర్మిస్తుండడం విశేషం.

ఇప్పుడీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడనే టాక్ హల్ చల్ చేస్తోంది. సావిత్రి జీవిత గాధ అంటే.. అందులో ఎన్టీఆర్.. ఏఎన్నాఆర్ ల పాత్రలు ఉండడం ఖాయమే. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ను.. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలని నిర్మాత ప్రియాంక దత్ భావిస్తున్నారు. జూనియర్ తో ఉన్న స్నేహాన్ని బేస్ చేసుకునే.. ఇప్పటికే ఈ ప్రతిపాదనను ఎన్టీఆర్ దగ్గరకు పంపారు కూడా. ఇంకా పూర్తి స్థాయి చర్చలు జరపకపోయినా.. ఎన్టీఆర్ తో కేమియో అయినా చేయించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

ఒక వేళ నిజంగానే ఎన్టీఆర్ పాత్రను జూనియర్ చేస్తే మాత్రం.. ఏఎన్నాఆర్ పాత్రకు కూడా ఆయన వారసులు సైన్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు ఈ సినిమా స్థాయి మరింతగా పెరిగిపోవడం ఖాయం. మరి తాత పాత్రను చేసేందుకు ఎన్టీఆర్ ఫైనల్ గా ఒప్పుకుంటాడా లేదా అనే అంశమే ఇప్పుడు అందరికీ సస్పెన్స్ గా మారింది.