Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సింగేశాడండోయ్‌!

By:  Tupaki Desk   |   30 Nov 2015 5:10 AM GMT
ఎన్టీఆర్ సింగేశాడండోయ్‌!
X
మ‌న హీరోలు ఆల్‌రౌండ‌ర్లు. వాళ్లకి రాని విద్యంటూ లేదేమో అనిపిస్తుంటుంది. ఎన్టీఆర్‌ నే తీసుకోండి. ఆయ‌న‌లో ఎంత మంచి న‌టుడున్నాడో అంత మంచి డ్యాన్స‌ర్ క‌నిపిస్తుంటాడు. ఎంత మంచి డ్యాన్స‌రో అంత మంచి గాయ‌కుడు కూడా. చిన్న‌ప్పుడే సంగీతంపై ప‌ట్టు పెంచుకున్న ఆయ‌న ప‌లు చిత్రాల్లో గీతాలు ఆల‌పించాడు. అలాంటి గాయ‌కుడు దొరికాక దేవిశ్రీప్ర‌సాద్ ఊరికే వ‌దిలేస్తాడా? ఛాన్సేలేదు. అస‌లే మ‌నోడు సెల‌బ్రిటీల‌తో పాట‌లు పాడించ‌డంలో మాంచి దిట్ట‌. దేవి సినిమా చేస్తున్నాడంటే అందులోని హీరోనో, హీరోయిన్నో మ‌రొక‌రో పాట పాడ‌తార‌ని ఫిక్స‌యిపోవ‌ల్సిందే.

ఇదివ‌ర‌కే ఎన్టీఆర్‌ తో పాట పాడించిన దేవి మ‌రోసారి ఆయ‌న గొంతు స‌వ‌రించుకొనేలా చేశాడు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలోని కీల‌క‌మైన పాట‌ని ఎన్టీఆర్ చేత పాడించాడు దేవి. ఇటీవ‌లే ఆ పాట‌ని హైద‌రాబాద్‌ లోని మ‌ణిశ‌ర్మ స్టూడియోలో రికార్డ్ చేశారు. మాంచి ఊపొచ్చే ఆ గీతం భ‌లే కుదిరింద‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో. సుక్కు సినిమా అంటే దానికి దేవినే సంగీతం అందిస్తాడు. వాళ్లిద్ద‌రూ క‌లిశారంటే ఆ పాట‌లు అదుర్స్ అనేలా ఉంటాయి. ముఖ్యంగా రెండు మూడు పాట‌లు ఊపొచ్చేలా ఉంటాయి. అందుకే సుక్కు - దేవిల సినిమాలోని సంగీతంపై అంచ‌నాలు పెరిగిపోతుంటాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలో పాట‌ల్ని సిద్ధం చేసిన‌ట్టు తెలిసింది. ఆ ఆల్బ‌మ్‌ కి ఎన్టీఆర్ పాటే హైలెట్‌ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. క్రేజీ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.