Begin typing your search above and press return to search.

చచ్చే ముందు కూడా అంతే - ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   10 Oct 2015 6:55 PM GMT
చచ్చే ముందు కూడా అంతే - ఎన్టీఆర్‌
X
మైండ్‌ బ్లోయింగ్‌ డైలాగులు చెప్పడమే కాదు.. మనస్సులో ఉన్నది క్లారిటీగా చెప్పడంలో కూడా యంగ్‌ టైగర్‌ తరువాతే ఎవరైనా. పూసాలు కదిలేలా వెండితెరమీద మాత్రమే కొట్టడం కాదు.. రాళ్ళు కరిగిపోయేలా ఫ్యాక్టులు కూడా మాట్టాడే హీరో ఎన్టీఆర్‌. ఎనీ డౌట్స్‌? అయితే ఓసారి ''షేర్‌'' ఆడియోకు వెళదాం పదండి.

అసలు జూ.ఎన్టీఆర్‌ అప్పట్లో నాన్నకు ప్రేమతో షూటింగ్‌ మధ్యలో ఇండియా వచ్చి ఓ వారం ఎందుకు ఇండియాలో గడిపాడు?? ఈ విషయంపై ఒక ప్రముఖ పత్రిక ఏం రాసిందంటే.. కిక్‌ 2 సినిమా ఆర్ధిక కష్టాల్లో ఉంది కాబట్టి.. తను సంతకాలు పెట్టి దిల్ రాజు దగ్గర 6 కోట్లు అప్పుగా. మరో 6 కోట్లు తన కాల్‌ షీట్ల తాలూకు రెమ్యూనరేషన్‌ గా తారక్‌ ఇప్పించాడు అని చెప్పకొచ్చిందా పత్రిక. దీని గురించి టైగర్‌ ఏమన్నాడో తెలుసా??

''రాసిన వారినీ తప్పు పట్టనూ.. అది చదివి నిజం అని అనుకున్నవారినీ తప్పు పట్టనూ.. కాని ఒక్క విషయం మాత్రం చెబుతున్నా.. ఏదో కిక్‌ 2 సినిమా టైములో ఆయనకు నేనేదో సంతకాలు పెట్టానని.. అబ్బే.. చచ్చేముందు కూడా కళ్యాణ్‌ రామ్‌ చెయ్యి ఇలాగే (చేత్తో దానం ఇస్తున్నట్లు చూపిస్తూ) ఉంటుంది కాని.. ఇలా ఉండదు (దానం తీసుకునే పొజిషన్‌ లో)'' అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌.

ఒకే ఒక్క మైండ్‌ బ్లోయింగ్‌ కామెంట్‌ తో నిజంగానే మనస్సులను కదిపేశాడు. లోపల మ్యాటర్‌ ఏదైనా.. అన్నంటే ఎన్టీఆర్‌ కు ఉన్న అభిమానం చాలా అభినందనీయం. జూనియర్‌.. నువ్వు సూపరబ్బా!!