Begin typing your search above and press return to search.

లుక్ తోనే ఇరగదీస్తున్న ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:05 AM GMT
లుక్ తోనే ఇరగదీస్తున్న ఎన్టీఆర్
X
ఎన్టీఆర్ తన కొత్త సినిమా కోసం రెడీ అయిపోతున్నాడు. జై లవ కుశ తర్వాత గ్యాప్ తీసుకుని మరీ తన నెక్ట్స్ ప్రాజెక్టుకు ప్రిపేర్ అవుతున్నాడు జూనియర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించనున్నారు. త్రివిక్రమ్ మూవీస్ తరహాలోనే.. ఇది కూడా ఫ్యామిలీ రిలేషన్స్ బేస్ గానే సాగనుందని చెబుతున్నారు.

అందుకే ఎన్టీఆర్ తన లుక్ ను మార్చుకుంటున్నాడనే టాక్ కొన్ని రోజుల నుంచి వినిపిస్తోంది. గత కొన్ని వారాలుగా జిమ్ లో ఎన్టీఆర్ తెగ కష్టపడిపోతున్నాడని చెబుతున్నారు కానీ.. ఇందుకు తగిన సాక్ష్యాలు ఏవీ బైటకు రాలేదు. అయితే.. బాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్.. ఎన్టీఆర్ కు ఫిట్నెస్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడన్నది ఇప్పటికే తెలిసిన విషయమే. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా తన ఫిట్నెస్ ట్రైనర్ కు గాలిపటాలు ఎగరేయడం నేర్పిస్తున్న ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ ఫోటోను కాసింత జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఎన్టీఆర్ కొత్త లుక్ గురించిన అప్డేట్ తెలిసిపోతుంది. జై లవకుశతో కంపేర్ చేస్తే.. ఎన్టీఆర్ విపరీతంగా తగ్గిపోయాడనే సంగతి అర్ధమవుతుంది.

ముఖ్యంగా ఆ గడ్డం మినహాయిస్తే.. దాదాపుగా బృందావనం నాటి లుక్ లోకి మారిపోయాడు జూనియర్. ఫ్యామిలీ రిలేషన్స్ బేస్డ్ గా సాగిన ఆ చిత్రం సాధించిన సక్సెస్ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆనాటి లుక్.. త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నీ కలిపితే ఎన్టీఆర్ ఇరగదీసేయడం ఖాయం అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్.