యూరోప్ ఎగిరిపోతోన్న జూనియర్ ఫ్యామిలీ

Fri Oct 13 2017 00:06:23 GMT+0530 (IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలిసింది. హిట్ సినిమాతో కలెక్షన్స్ రాబట్టడం పెద్ద మ్యాటరేమీ కాదు. బాగుందంటే జనాలు ఆటోమేటిక్ గా వస్తారు. కానీ యావరేజ్ టాక్ వచ్చినపుడో.. బ్యాడ్ టాక్ వచ్చినపుడో..టఫ్ కాంపిటీషన్ ఉన్నపుడో తెచ్చే వసూళ్లే.. ఆ హీరో రియల్ సత్తాకి కొలమానాలు.ఈ అన్ని పారామీటర్స్ ను జై లవకుశ చిత్రానికి మంచి వసూళ్లు సాధించాడు జూనియర్. మిక్సెడ్ టాక్ కంటే తక్కువగానే ఉన్న చిత్రాన్ని దాదాపుగా సేఫ్ జోన్ లోకి తెచ్చేశాడంటే.. అది మూడు పాత్రల్లో ఎన్టీఆర్ చూపించిన యాక్టింగ్ ట్యాలెంట్. ఇంకా సేఫ్ జోన్ కి రాకపోయినా.. జై లవకుశ వసూళ్లతో సంతృప్తిగానే బ్రేక్ తీసుకుంటున్నాడు జూనియర్. దాదాపు మూడు నెలలకు పైగా ఇప్పుడు సినిమాలేమీ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తో ఉంటుందనే విషయం ఇప్పటికే ఖాయమైంది. ఇది మొదలవడానికి మినిమం 3 నెలలు సమయం ఉండడంతో.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇప్పుడు యూరోప్ టూర్ కు బయల్దేరుతున్నాడు జూనియర్.

ఇవాళ ఎన్టీఆర్ తన భార్యా పిల్లలతో కలిసి యూరోప్ టూర్ కు ఫ్లైట్ ఎక్కేయనున్నాడు. ఆస్ట్రియా.. జర్మనీ.. నెదర్లాండ్స్ సహా యూరోప్ లోని పలు దేశాల్లో ఎన్టీఆర్ టూర్ ఉండనుంది. కేవలం తన కుటుంబానికి మాత్రమే ఈ టూర్ లో భాగం కల్పించిన యంగ్ టైగర్.. నెల రోజులకు పైగా యూరోప్ లోని పలు ప్రాంతాలను సందర్శించనున్నాడట.